పాక్‌ సైన్యంతో ప్రమాదమే: సీడీఎస్‌

Despite economic turmoil Pak military remains threat for us says CDS - Sakshi

న్యూఢిల్లీ: పొరుగుదేశం పాకిస్తాన్‌ ఆర్థిక సమస్యల్లో చిక్కుకున్నప్పటికీ, ఆ దేశ ఆర్మీతో మనకు ప్రమాదంఎప్పటిలాగానే ఉందని చీఫ్‌ ఆఫ్‌ డిఫెన్స్‌ స్టాఫ్‌ (సీడీఎస్‌) జనరల్‌ అనిల్‌ చౌహాన్‌ వ్యాఖ్యానించారు. పాక్‌ సైనిక సామర్థ్యం చెక్కు చెదరలేదని చెప్పారు. అయితే సరిహద్దులను, ముఖ్యంగా వివాదాస్పద ఉత్తర సరిహద్దులను కాపాడుకోగల సత్తా మన సైన్యానికి ఉందని శనివారం ఇండియా టుడే కాంక్లేవ్‌లో చెప్పారు.

‘చైనా బలపడుతుండటం, ఆ దేశంతో తెగని సరిహద్దు వివాదం మనకు తక్షణ సవాలుగా మారింది. చైనా, పాక్‌ మనకు బద్ధ శత్రువులు. పైగా వీరివద్ద అణ్వాయుధాలున్నాయి. యుద్ధ రీతుల్లో ఎప్పటికప్పుడు అనూహ్య మార్పులు చోటుచేసుకుంటున్నాయి. మన ఆర్మీకి ఇదే అతి పెద్ద సవాల్‌గా మారింది. కొత్త ఆయుధ వ్యవస్థలను సమకూర్చుకోవడం, సాంకేతికతను అందిపుచ్చుకోవడం, వ్యూహాలు, ప్రతివ్యూహాలను రచించుకోవడం వంటివి కొనసాగుతున్నాయి’’ అని జనరల్‌ చౌహాన్‌ చెప్పారు.

Election 2024

Read latest National News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram


 

Read also in:
Back to Top