లిక్కర్‌ కేసు: కేజ్రీవాల్‌కు మళ్లీ చుక్కెదురు | Court Reserve Kejriwal Custody Order In Cbi Case | Sakshi
Sakshi News home page

లిక్కర్‌ స్కామ్‌: సీబీఐ కేసులో కేజ్రీవాల్‌కు జ్యుడీషియల్‌ రిమాండ్‌

Jun 29 2024 4:23 PM | Updated on Jun 29 2024 5:17 PM

Court Reserve Kejriwal Custody Order In Cbi Case

న్యూఢిల్లీ: ఢిల్లీ లిక్కర్‌ కేసులో భాగంగా సీఎం,ఆమ్‌ఆద్మీపార్టీ(ఆప్‌) అధినేత అరవింద్‌ కేజ్రీవాల్‌ను సీబీఐ శనివారం(జూన్‌29) రౌస్‌ఎవెన్యూ కోర్టులో ప్రవేశపెట్టింది. ఈ కేసులో కేజ్రీవాల్‌కు కోర్టు జులై 12 దాకా జ్యుడీషియల్‌ రిమాండ్‌ విధించింది.

లిక్కర్‌ స్కామ్‌ మనీలాండరింగ్‌ వ్యవహారంలో ఇప్పటికే ఎన్‌ఫోర్స్‌మెంట్‌ డైరెక్టరేట్‌(ఈడీ) కేసులో అరెస్టయి రిమాండ్‌లో ఉన్న కేజ్రీవాల్‌ను ఇటీవల సీబీఐ అరెస్టు చేసిన విషయం తెలిసిందే. అరెస్టు తర్వాత కేజ్రీవాల్‌ను 3 రోజులు సీబీఐ రిమాండ్‌కు కోర్టు అప్పగించింది. 

శనివారం  ఈ రిమాండ్‌ ముగియడంతో  శనివారం కోర్టులో ప్రవేశపెట్టారు. కోర్టు కేజ్రీవాల్‌ను జ్యుడీషియల్‌ రిమాండ్‌కు పంపించే విషయమై తొలుత తీర్పు రిజర్వు చేసిన కోర్టు కొద్దిసేపటి తర్వాత రిమాండ్‌ విధిస్తూ ఆదేశాలు జారీ చేసింది. 

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement