సిద్ధరామయ్యపై స్టింగ్‌ ఆపరేషన్‌.. మరో బిగ్‌ ట్విస్ట్‌ | Congress Expels Kripa Alva on Sting Operation Of Party Leaders | Sakshi
Sakshi News home page

సిద్ధరామయ్యపై స్టింగ్‌ ఆపరేషన్‌.. మరో బిగ్‌ ట్విస్ట్‌

Oct 31 2026 11:05 AM | Updated on Oct 31 2026 11:24 AM

Congress Expels Kripa Alva on Sting Operation Of Party Leaders

స్టింగ్‌ ఆపరేషన్‌.. పెను వివాదం.. మాజీ సీఎం సిద్ధరామయ్య.. వీడియో.. ఈ వ్యవహారం కర్ణాటక కాంగ్రెస్‌లో ప్రకంపనలు సృష్టిస్తోంది. స్టింగ్‌ ఆపరేషన్‌ వెనుక ఉన్నారనే ఆరోపణలు ఎదుర్కొంటున్న ఆ పార్టీ మాజీ ప్రధాన కార్యదర్శి కృపా ఆళ్వాపై కాంగ్రెస్‌ వేటు వేసింది. ఏకంగా ఆరేళ్ల పాటు పార్టీ నుంచి బహిష్కరిస్తూ సంచలన నిర్ణయం తీసుకుంది. ఆమెను ఆరేళ్ల పాటు పార్టీ నుంచి బహిష్కరిస్తూ కర్ణాటక ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ (కేపీసీసీ) ఉత్తర్వులు జారీ చేసింది.

కేపీసీసీ ఉపాధ్యక్షుడు ఎం. నారాయణస్వామి ఈ మేరకు బహిష్కరణ ఉత్తర్వులు జారీ చేస్తూ.. వ్యవహారం కారణంగా పార్టీకి ఇబ్బందికర పరిస్థితులు ఎదురయ్యాయని పేర్కొన్నారు. ఈ వ్యవహారంపై వివరణ ఇవ్వాలని గతంలోనే కృపా ఆళ్వాకు షోకాజ్ నోటీసులు జారీ చేసినప్పటికీ.. ఇప్పటివరకు ఆమె నుంచి ఎలాంటి సమాధానం రాలేదని తెలిపారు. మరో వైపు, ఈ వివాదాస్పద వీడియో వెనుక కృపా ఆళ్వా ఉన్నారని కర్ణాటక మాజీ ముఖ్యమంత్రి సిద్ధరామయ్య ఆరోపించారు. ఈ వీడియోను ప్రసారం చేయడం, ప్రచురించడంపై మీడియా సంస్థలకు వ్యతిరేకంగా ఆయన కోర్టు నుంచి ఇంజక్షన్ ఉత్తర్వులు కూడా పొందారు.

సిద్ధరామయ్యపై లైంగిక వేధింపుల ఆరోపణలు ఉన్నట్లు చూపించిన ఈ స్టింగ్ ఆపరేషన్‌పై బెంగళూరు పోలీసులు దర్యాప్తు చేపట్టారు. ఈ క్రమంలో గురువారం కీలక ప్రకటన చేశారు. వీడియోలో పేర్కొన్న లైంగిక వేధింపుల ఆరోపణలు పూర్తిగా కల్పితమైనవని, ఉద్దేశపూర్వకంగా అల్లిన కథనంలో భాగమని పోలీసులు వెల్లడించారు. దర్యాప్తులో సేకరించిన వాంగ్మూలాలు, ఆధారాలు పరిశీలించగా.. వీడియోలో ప్రస్తావించినట్లుగా ఎలాంటి ఘటన జరిగినట్లు నిర్థారించే ఆధారాలు లభించలేదని స్పష్టం చేశారు.

ఇదీ  చదవండి: ఢిల్లీలో వింత వాతావరణం.. 75 ఏళ్లలో ఎన్నడూ లేనంతగా..!
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement