
ఉత్తరప్రదేశ్ సీఎం యోగి ఆదిత్యనాథ్ ప్రకటన
మథుర: ఉత్తరప్రదేశ్‌లో భారీ ఆధ్యాత్మిక ప్రాజెక్టుకు యోగి ఆదిత్యనాథ్ ప్రభుత్వం శ్రీకారం చుట్టబోతోంది. యూపీలోని బ్రిజ్ ప్రాంతంలో ద్వాపర యుగంతో సంబంధం ఉన్న మథుర, బృందావన్, బర్సానా, గోకుల్(బ్రిజ్ క్షేత్ర)ను రూ.30,000 కోట్లతో అభివృద్ధి చేయబోతున్నట్లు సీఎం యోగి ఆదిత్యనాథ్ శనివారం ప్రకటించారు. ఈ నాలుగు దివ్య క్షేత్రాలను అనుసంధానించబోతున్నట్లు తెలిపారు.
పురాణాల ప్రకారం శనివారం శ్రీకృష్ణుడి 5,252వ జన్మదినం. ఈ సందర్భంగా యోగి ఆదిత్యనాథ్ మథుర పట్టణంలో పలువురు యోగులు, గురువులను సన్మానించారు. మథుర–బృందావన్‌లో రూ.646 కోట్ల విలువైన 118 అభివృద్ధి ప్రాజెక్టులు ప్రారంభించారు. మరికొన్నింటికి శంకుస్థాపన చేశారు. అయోధ్యలో భవ్య రామమందిర నిర్మాణం అసాధ్యమని పదేళ్ల క్రితం అన్నారని, ఇప్పుడు అది కార్యరూపం దాల్చిందని చెప్పారు.