ప్రధాని మోదీ కనుసన్నల్లో ఈసీ అధికారులు పని చేస్తున్నారు
రాహుల్, ప్రియాంకలపై పోలీసుల దాడి మోదీ, అమిత్ షాల అసహనానికి నిదర్శనం
ఢిల్లీలో సీఎం రేవంత్‌రెడ్డి
పోలీస్‌స్టేషన్ వద్ద రాహుల్, ప్రియాంకలను కలిసేందుకు యత్నం
అడ్డుకున్న పోలీసులు
సాక్షి, న్యూఢిల్లీ: దేశంలో పౌరుల ఓటు హక్కును హరించేందుకు కేంద్ర ప్రభుత్వం భారీ కుట్ర పన్నుతోందని సీఎం రేవంత్‌రెడ్డి తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. ప్రధాని నరేంద్ర మోదీ కనుసన్నల్లోనే ఎన్నికల సంఘం అధికారులు పనిచేస్తున్నా రని ఆరోపించారు. ఓటర్ల జాబితాలో తప్పు లు చేసిన వారిని వదిలేసి, ఆ తప్పు లను సరిదిద్దాలని డిమాండ్ చేసిన రాహుల్‌గాంధీ, ప్రియాంకాగాంధీ, మల్లి కార్జున ఖర్గేలతో పాటు ఇండియా కూటమి నేతలను అరెస్టు చేయడం ప్రజా స్వామ్యాన్ని అపహా స్యం చేయడమేనని ఆగ్ర హం వ్యక్తం చేశారు.
రాహుల్, ప్రియాంకలపై పోలీసుల దాడి మోదీ, అమిత్ షాల అసహ నానికి నిదర్శన మని విమర్శించారు. దేశంలో ప్రతిపక్ష నేతలపై ఇలాంటి దాడులు జరగ డం ప్రజాస్వామ్యానికి చీకటి రోజని అభి వర్ణి ంచారు. బుధవారం ఎన్నికల ప్రధాన కమిషనర్ జ్ఞానేశ్‌కుమార్ రాజీనామా చేయాలని డిమాండ్‌చేస్తూ.. జంతర్‌మంతర్ వద్దకు బయలుదేరిన రాహుల్, ప్రియాంక తదితరు లను పోలీసులు అరెస్టు చేసి బారఖంబా పోలీస్ స్టేషన్‌కు తరలించారు. ఢిల్లీకి వచ్చిన సీఎం రేవంత్‌రెడ్డి.. కేరళ సీఎం వీడీ సతీషన్, రాష్ట్ర మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి, ఎంపీలతో కలిసి వారిని కలిసేందుకు ప్రయత్నించగా పోలీసులు అడ్డుకున్నారు. అనంతరం ఆయన మీడియాతో మాట్లా డారు. రాహుల్‌గాంధీ, ప్రియాంకా గాంధీ, ఖర్గేల అరెస్టు దారుణమని మండిపడ్డారు.
ప్రజలను రెండు వర్గాలుగా విభజించే యత్నం
దేశ ప్రజలను రెండు వర్గాలుగా విభజించేందుకు కేంద్రం ప్రమాదకర క్రీడకు తెరలేపిందని సీఎం విమర్శించారు. ఓటు హక్కు ఉన్నవారు, ఓటు హక్కు లేని పౌరులుగా దేశాన్ని విడగొడుతున్నారని ఆందోళన వ్యక్తం చేశారు. ప్రధాని మోదీ ఆదేశాల మేరకే సీఈసీ జ్ఞానేశ్‌కుమార్ వ్యవహరి స్తున్నారని, ఆయన తక్షణమే తన పదవికి రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు.
‘సైమన్ గో బ్యాక్’ తరహాలోనే
నాడు స్వాతంత్య్ర పోరాటంలో ‘సైమన్ గో బ్యాక్’ ఉద్యమం ఏవిధంగా దేశానికి స్వాతంత్య్రం తెచ్చిందో, నేడు జ్ఞానేశ్ కుమార్ రాజీనామా కోరుతూ చేస్తున్న ఈ ఆందోళన కూడా భవిష్యత్తులో నరేంద్ర మోదీని అధికారంలో నుంచి దించడానికి దారితీస్తుందని హెచ్చరించారు. ఎన్నికల కమిషన్‌ను వాడుకుని ఓట్లను తొలగించడం ద్వారా రాజ్యాంగం కల్పించిన హక్కులను కాలరాస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. రాబోయే రోజుల్లో ఈ అప్రజాస్వామిక విధా నాలపై దీర్ఘకాలిక కార్యాచరణతో పోరాడతా మని, ప్రజలందరినీ ఏకం చేసి ఈ కుట్ర లను మూకుమ్మడిగా తిప్పికొడతామన్నారు.
రఘురాంరెడ్డికి గాయాలు
రాహుల్‌గాంధీకి సంఘీభావంగా రాష్ట్ర ఎంపీలు మల్లు రవి, చామల కిరణ్‌కుమార్‌రెడ్డి, గడ్డం వంశీకృష్ణ, రామసహాయం రఘురాం రెడ్డి తదితరులు ఆందోళనలో పాల్గొన్నారు. రాహుల్‌తో కలిసి జంతర్ మంతర్‌వైపు వస్తున్న ఎంపీలను పోలీసులు అడ్డుకున్నా రు. ఈ సందర్భంగా పోలీసులు ఎంపీలపై లాఠీలు ఝుళిపించారు. దీంతో ఖమ్మం ఎంపీ రఘురాంరెడ్డికి గాయాలయ్యాయి.


