
ఆమె భర్తకు పంపిన ప్రబుద్ధుడు
ఖైరాగఢ్ (ఛత్తీస్‌గఢ్): మ్యూజిక్ సిస్టమ్‌లో బాంబు పెట్టి ప్రేమించిన మహిళ భర్తకు బహుమతిగా పంపాడో వ్యక్తి. ఈ ఘటన ఛత్తీస్‌గఢ్‌లో జరిగింది. ఖైరాగఢ్‌లోని కుసామి గ్రామానికి చెందిన వినయ్ వర్మ ఎల్రక్టీషియన్. కాలేజీ చదివేప్పటినుంచే ఓ యువతిని ప్రేమించాడు. ఆ విషయాన్ని ఆమెకూ చెప్పలేదు. ఈలోపు ఆమెకు పెళ్లయిపోయింది.
ఎలాగైనా ఆమె భర్త ఖాన్‌ను చంపాలనుకున్నాడు. గూగుల్‌లో శోధించాడు. ఆన్‌లైన్ ట్యుటోరియల్స్ చూసి మ్యూజిక్ సిస్టమ్ స్పీకర్‌లో ఐఈడీని అమర్చాడు. మ్యూజిక్ సిస్టమ్ ప్లగిన్ చేయగానే బాంబు పేలిపోయేలా రూపొందించాడు.
పార్సిల్‌ని మాన్పూర్‌లోని అఫ్సర్‌ఖాన్‌కు పంపించాడు. అయితే పార్సిల్ అందుకున్న ఖాన్ అనుమానంతో పోలీసులకు సమాచారం అందించాడు. బాంబు స్క్వాడ్ వచ్చి ప్యాకేజీని పరిశీలించగా, స్పీకర్ లోపల దాచిన 2 కిలోల ఐఈడీ దొరికింది. హత్య కుట్రను భగ్నం చేసిన పోలీసులు.. వినయ్‌వర్మను, అతనికి సహకరించిన మిత్రులను అరెస్టు చేశారు. వర్మకు వీటిని అందించిన స్మగ్లింగ్ ముఠాను పట్టుకున్నారు.