కేరళ బీజేపీ చీఫ్‌గా రాజీవ్‌ చంద్రశేఖర్‌!  | BJP picks Union minister Rajeev Chandrasekhar as state President | Sakshi
Sakshi News home page

కేరళ బీజేపీ చీఫ్‌గా రాజీవ్‌ చంద్రశేఖర్‌! 

Mar 24 2025 4:48 AM | Updated on Mar 24 2025 4:48 AM

BJP picks Union minister Rajeev Chandrasekhar as state President

తిరువనంతపురం: బీజేపీ నేత, కేంద్ర మాజీ మంత్రి రాజీవ్‌ చంద్రశేఖర్‌(60) కేరళ బీజేపీ అధ్యక్షుడిగా నియమితులు కానున్నారు. ఈ పోస్టు కోసం ఆయనొక్కరే దరఖాస్తు చేసుకోవడంతో ఎన్నిక ఏకగ్రీవం కానుంది. 

సోమవారం జరిగే పార్టీ రాష్ట్ర కౌన్సిల్‌ సమావేశం అనంతరం ఇందుకు సంబంధించిన ప్రకటన అధికారికంగా వెలువడనుంది. పార్టీ కేంద్ర పరిశీలకుడిగా సమావేశానికి హాజరుకానున్న ప్రహ్లాద్‌ జోషి ఈ నియామకాన్ని ధ్రువీకరించనున్నారు. పార్టీ రాష్ట్ర విభాగం అధ్యక్ష పదవి కోసం ఆదివారం రాజధాని తిరువనంతపురంలోని పార్టీ కార్యాలయంలో రాజీవ్‌ చంద్ర శేఖర్‌ రెండు సెట్ల నామినేషన్‌ పత్రాలను దాఖలు చేశారు.  

Advertisement
 
Advertisement
Advertisement