అదుపుతప్పిన అమిత్‌ షా హెలికాప్టర్‌.. నేలను తాకబోయి... | Amit Sha Helicopter Just Missed Crashing | Sakshi
Sakshi News home page

అదుపుతప్పిన అమిత్‌ షా హెలికాప్టర్‌.. నేలను తాకబోయి...

Published Mon, Apr 29 2024 8:32 PM | Last Updated on Mon, Apr 29 2024 8:34 PM

Amit Sha Helicopter Just Missed Crashing

పాట్నా: కేంద్ర హోం మంత్రి, బీజేపీ అగ్రనేత అమిత్‌షాకు పెద్ద ప్రమాదం తప్పింది. షా ప్రయాణిస్తున్న హెలికాప్టర్‌ టేకాఫ్‌ అవుతుండగా అదుపుతప్పి నియంత్రణ కోల్పోయింది. బిహార్‌లోని బెగుసరాయ్‌లో ఎన్నికల ప్రచారానికి వెళ్లినపుడు సోమవారం(ఏప్రిల్‌29) ఈ ఘటన జరిగింది.

ప్రచారం ముగించుకుని అమిత్‌ షా హెలికాప్టర్‌ ఎక్కారు. హెలికాప్టర్‌ గాల్లోకి లేచే సమయంలో ఊగిసలాడి కుడివైపుకు వెళ్లింది. ఒక దశలో కిందకు వచ్చి నేలను తాకే దాకా వెళ్లింది. ఇంతలో అప్రమత్తమైన హెలికాప్టర్‌ను పైలట్‌ నియంత్రణలోకి తీసుకోవడంతో సరైన దిశలో ప్రయాణించింది. ఈ దృశ్యాలు సోషల్‌మీడియాలో వైరల్‌గా మారాయి.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement
 
Advertisement
 
Advertisement