సాక్షి, చెన్నై: తమిళనాడు శాసనసభ సభ్యులు తమ నియోజకవర్గాల్లో ప్రజా సేవలను మరింత సమర్థవంతంగా నిర్వహించేందుకు వీలుగా వారి వివిధ రకాల నెలసరి భత్యాలను పెంచుతూ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. దీని నిమిత్తం 1981 నాటి చట్టానికి సవరణలు చేస్తూ అసెంబ్లీలో బిల్లును ప్రవేశపెట్టారు. ఈ అలవెన్సుల పెంపు వలన రాష్ట్ర ∙నిధి నుండి ఏటా రూ. 43.28 కోట్లు అదనపు ఖర్చు కానుందని ఆర్థిక నివేదికలో ప్రకటించారు.
ఎమ్మెల్యేలకు ప్రస్తుతం ఇస్తున్న నెలసరి వాహన భత్యాన్ని రూ. 25వేల నుండి రూ. 75,వేలకు పెంచారు. తాజాగా రూ. 50 వేలు పెరిగింది. ఎమ్మెల్యేలకు సహాయకుడిగా ఉండే వ్యక్తి ఖర్చుల కోసం కొత్తగా నెలకు రూ. 25,000 అలవెన్స్ అందించనున్నారు. శాసనసభ సభ్యుల ఇతర నెలసరి అలవెన్సులను రూ. 1,000 నుండి రూ. 5,000 వరకు పెరనిగాయి. వ్యక్తిగత ఖర్చుల నిమిత్తం నెలకు రూ. 5,000 కొత్త భత్యం అందించనున్నారు.
శాసనసభ్యులు ప్రజలకు అందుబాటులో ఉంటూ ప్రజా సంక్షేమ విధులు సజావుగా పూర్తి చేయడానికే ఈ భత్యాల పెంపు దోహదపడుతుందని నివేదికలో పేర్కొన్నారు. కాగా, వ్యాపారుల ఫిర్యాదులకు తగిన పరిష్కారం దిశగా రూ. 3 లక్షలతో కొత్త వెబ్ సైట్ రూపకల్పన చేయనున్నామని రెవెన్యూ శాఖ మంత్రి లోకేష్ తమిళ్ సెల్వన్ అసెంబ్లీలో ప్రకటించారు.
చతవండి: పవిత్రగౌడ బ్యారక్ మార్పు!


