అమృత్‌సర్: ఢిల్లీ నుంచి అమృతసర్‌కు వెళుతున్న ఎయిర్ ఇండియా విమానం సాంకేతిక సమస్యతో పెద్ద ప్రమాదంలో పడింది. సాంకేతిక సమస్యతో పొరపాటున పాకిస్థాన్ గగనతలంలోకి ప్రవేశించింది. అనంతరం పాకిస్థాన్ ఎయిర్ ట్రాఫిక్ కంట్రోల్ హెచ్చరికలతో అప్రమత్తమైన పైలట్లు, వెంటనే విమానాన్ని సరిదిద్ది తిరిగి భారత గగనతలంలోకి మరలించారు. దీంతో పెను ప్రమాదం తప్పింది. ఈ ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది.
అసలేం జరిగింది?
జూన్ 22 రాత్రి రాత్రి 9:18 ప్రాంతంలో ఢిల్లీ నుంచి అమృత్‌సర్‌కు బయలుదేరిన ఎయిర్ ఇండియా విమానం (AI-479) బయిలుదేరింది. అయితే సాంకేతిక సమస్యలతో పొరపాటున పాకిస్థాన్ గగనతలంలోకి ప్రవేశించింది. దీంతో పాకిస్థాన్ ఎయిర్ ట్రాఫిక్ కంట్రోల్ (ATC) హెచ్చరించారు. దీంతో వెంటనే అప్రమత్తమైన పైలట్లు, వెంటనే విమానాన్ని సరిదిద్ది తిరిగి భారత గగనతలంలోకి ప్రవేశపెట్టారు. దీంతో విమానం యూ-టర్న్ తీసుకుని సురక్షితంగా భారత్‌లోకి ప్రవేశించింది.
అయితే విమానం అమృత్‌సర్ చేరుకునే సమయానికి ఎయిర్‌పోర్ట్‌లో విమానాల రద్దీ ఎక్కువగా ఉండటంతో, అధికారులు దానిని తిరిగి ఢిల్లీకి మళ్లించారు.అనంతరం ఢిల్లీలో తనిఖీల అనంతరం తిరిగి బయలుదేరి, జూన్ 23 తెల్లవారుజామున 2:20 గంటలకు విమానం అమృత్‌సర్‌లో సురక్షితంగా ల్యాండ్ చేశారు.
పాకిస్థాన్ ల్యాండ్‌లోకి ఎందుకు వెళ్లకూడదు?
భారతదేశానికి చెందిన ఏ విమానమూ పాకిస్థాన్ గగనతలంలోకి వెళ్లకూడదు. పహల్గామ్ ఉగ్రదాడి అనంతరం రెండు దేశాల మధ్య దౌత్యసంబంధాలు తీవ్రంగా దెబ్బతిన్నాయి. ఇరు దేశాలు ఎయిర్ స్పేస్ బ్యాన్ విధించుకున్నాయి. ఒక దేశ విమానాలు మరో దేశంలో ఎట్టిపరిస్థితుల్లో గగన స్థలంలో సంచరించకూడదు. ఈ గడువను నెలనెల పొడిగింపు చేస్తూ వస్తున్నారు. తాజా ఉత్తర్వుల ప్రకారం ఈ నిషేధం జూలై 24, 2026 వరకు అమల్లో ఉంటుంది.


