ఆర్‌ఓ నిర్ణయాన్ని రద్దు చేయాలి | Action illegal, no case against Meenakshi Natarajan | Sakshi
Sakshi News home page

ఆర్‌ఓ నిర్ణయాన్ని రద్దు చేయాలి

Jun 11 2026 4:46 AM | Updated on Jun 11 2026 2:24 PM

Action illegal, no case against Meenakshi Natarajan

మీనాక్షి నామినేషన్‌ తిరస్కరణపై ఎన్నికల సంఘానికి కాంగ్రెస్‌ ఫిర్యాదు   

సాక్షి, న్యూఢిల్లీ: మధ్యప్రదేశ్‌లో రాజ్యసభ ఎన్నికల బరిలో నిలిచిన కాంగ్రెస్‌ అభ్యర్థి మీనాక్షి నటరాజన్‌ నామినేషన్‌ను రిటరి్నంగ్‌ అధికారి(ఆర్‌ఓ) తిరస్కరించడాన్ని ఆ పార్టీ తీవ్రంగా తప్పుబట్టింది. ఆర్‌ఓ నిర్ణయం చట్టవిరుద్ధం అప్రజాస్వామికమని తేల్చిచెప్పింది. నామినేషన్‌ను పునరుద్ధరించాలని డిమాండ్‌ చేసింది. ఈ మేరకు కాంగ్రెస్‌ సీనియర్‌ నేతల బృందం బుధవారం కేంద్ర ఎన్నికల సంఘం ప్రధాన కమిషనర్‌ను కలిసి ఫిర్యాదు చేసింది. 

కేసీ వేణుగోపాల్, అభిషేక్‌ సింఘ్వీ, వివేక్‌ తంఖా, రణదీప్‌ సూర్జేవాలా, దీపాదాస్‌ మున్షీ, భూపేశ్‌ బఘేల్‌ల బృందం ఈసీని కలిసి తమ వాదనను విన్పించింది. అనంతరం అభిషేక్‌ సింఘ్వీ మీడియాతో మాట్లాడారు. ‘‘మీనాక్షి నామినేషన్‌ తిరస్కరణకు ఆర్‌ఓ చూపిన కారణాలకు చట్టపరమైన ఆధారాలు లేవు. ఏదైనా క్రిమినల్‌ కేసులో నేరాన్ని న్యాయస్థానం పరిగణనలోకి తీసుకున్న తర్వాత మాత్రమే అది కేసుగా మారుతుందన్న ప్రాథమిక న్యాయ సూత్రాన్ని రిటర్నింగ్‌ అధికారి విస్మరించారు. 

మీనాక్షి నటరాజన్‌ వ్యవహారంలో ఓ ప్రైవేట్‌ వ్యక్తి ఇచ్చిన ఫిర్యాదుపై కేసును ఎందుకు పరిగణనలోకి తీసుకోకూడదో వివరణ ఇవ్వాలంటూ కోర్టు కేవలం నోటీసు మాత్రమే ఇచ్చింది. మేజిస్ట్రేట్‌ దీనిపై నిర్ణయం తీసుకోనంత వరకు అది క్రిమినల్‌ కేసుగా లెక్కలోకి రాదు’’ అని తెలిపారు. రాజ్యాంగంలోని ఆర్టికల్‌ 324 కింద కేంద్ర ఎన్నికల సంఘానికి విశేషాధికారాలు ఉన్నాయని కాంగ్రెస్‌ బృందం వెల్లడించింది. అభ్యర్థికి న్యాయం చేసేందుకు ఆర్‌ఓ నిర్ణయాన్ని రివర్స్‌ చేసే అధికారం ఈసీకి ఉందని గుర్తుచేసింది. 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement