యూనివర్శిటీ విద్యార్థిని మృతి కేసు : నిందితుడిపై కాల్పులు | Accused In Guwahati Homestay Death Shot In Leg After Escape Attempt | Sakshi
Sakshi News home page

యూనివర్శిటీ విద్యార్థిని మృతి కేసు : నిందితుడిపై కాల్పులు

Oct 6 2026 6:29 PM | Updated on Oct 6 2026 6:36 PM

Accused In Guwahati Homestay Death Shot In Leg After Escape Attempt

అస్సాంలోని కామ్రూప్ మెట్రోపాలిటన్ జిల్లాలో  గౌహతి యూనివర్సిటీ విద్యార్థిని మరణానికి సంబంధించి మరో కీలక పరిణామం చోటు చేసుకుంది. ఈ కేసులో అరెస్టయిన నిందితుడు ఆశిక్అలీని అస్సాంలోని కామరూప్ మెట్రోపాలిటన్ జిల్లాలోని ఒక ప్రాంతానికి తీసుకెళ్తుండగా తప్పించుకోవడానికి ప్రయత్నించడంతో  కాల్పులు  జరిపినట్లు పోలీసు వర్గాలు తెలిపాయి.

ఈ ఘటన మంగళవారం  తెల్లవారుజామున సుమారు 3:30 గంటలకు జరిగింది. పోలీసుల  సమాచారం ప్రకారం దర్యాప్తులో భాగంగా విచారణకు పోలీసు బృందం తీసుకెళ్తుండగా,  అలీ పారిపోయేందుకు యత్నించాడు.  దీంతో పోలీసులు అతని కాళ్లపై కాల్పులు జరిపారు. అలీ కాలికి గాయమవడంతో చికిత్స నిమిత్తం గౌహతి మెడికల్ కాలేజ్ అండ్ హాస్పిటల్ (GMCH)కి తరలించి చికిత్స అందిస్తున్నారు.

కాగా సెప్టెంబర్ 26న గరల్-ధారాపూర్ ప్రాంతంలోని ఒక హోమ్‌స్టేలో తీవ్ర గాయాలతో విద్యార్థిని మృతి చెందిన ఘటనపై అనుమానాస్పద మరణంగా కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేపట్టారు. ఈ కేసులో ప్రధాన నిందితులలో అలీ ఒకడు ఈ ఘటనకు సంబంధించి హోమ్‌స్టేకి సంబంధించిన వ్యక్తులను విచారించడంతో పాటు, అసలు ఏం జరిగిందనే దానిపై ఆరా తీస్తున్నారు.

ఇదీ చదవండి: నో షూస్‌, నో సూట్..1600 మీటర్ల రన్‌, అదీ చీరలో

విచారణ సమయంలో ఆమె సీలింగ్ ఫ్యాన్‌కు ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకుందని అలీ చెప్పాడు. దీంతో అతని  వెర్షన్‌ను ఇతర సాక్ష్యాలతో సరిపోల్చి చూస్తున్నామని పోలీసులు తెలిపారు. హోమ్‌‌స్టేలో అతిథుల రికార్డులు, ఘటన తర్వాత ఆ ప్రాంగణంలోకి ఎవరెవరు ప్రవేశించారనే దానిపై కూడా దృష్టి సారించారు.

ఇదీ చదవండి: కుక్కర్‌, బెల్ట్‌, మొబైల్‌ చార్జర్‌ : దుబాయ్‌లో కొత్త పెళ్లికూతురికి చిత్రహింసలు

మరోవైపు సాక్ష్యాలను తారుమారు చేశారనే ఆరోపణలతో ఈ కేసుకు సంబంధించి హోమ్‌స్టే ఉద్యోగిని పోలీసులు అరెస్టు చేశారు. దర్యాప్తులో భాగంగా అలీకి సంబంధించిన ఇతర వ్యక్తులను కూడా పోలీసులు ప్రశ్నించారు.పలు నిబంధనల కింద అలీపై కేసులు నమోదు చేసి, విచారణ నిమిత్తం పోలీసు కస్టడీకి తరలించారు. అలీ పారిపోవడానికి ఎలా ప్రయత్నించాడు, ఆయుధాలను ఉపయోగించ డానికి దారితీసిన పరిస్థితులు, అతనికి తుపాకి గాయం ఎలా తగిలిందనే కోణంలో మంగళవారం జరిగిన కాల్పుల ఘటనపై కూడా అధికారులు దర్యాప్తు చేయనున్నారు.

ఇదీ చదవండి: హవ్వ..బీజేపీ ఎమ్మెల్యే బంగ్లా క్లీనింగ్‌కు ఫైర్‌ ఇంజీనా? వీడియో వైరల్‌

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement