హృదయ విదారకం: తొక్కిసలాటపై ప్రధాని దిగ్భ్రాంతి | Absolutely Heartrending PM on Bengaluru Stampede | Sakshi
Sakshi News home page

హృదయ విదారకం: తొక్కిసలాటపై ప్రధాని దిగ్భ్రాంతి

Jun 4 2025 8:17 PM | Updated on Jun 4 2025 8:28 PM

Absolutely Heartrending PM on Bengaluru Stampede

న్యూఢిల్లీ: బెంగళూరులోని చిన్నస్వామి స్టేడియంలో ఆర్సీబీ విజయోత్సవాల్లో జరిగిన తొక్కిసలాట ఘటనపై ప్రధాని మోదీ దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ఆర్సీబీ ఈవెంట్‌లో 11మంది మృతి చెందడం విచారకరమని అన్నారు. ఇది హృదయవిదారక ఘటన అని, బాధిత కుటుంబాలు తవ్ర ఆవేదనలో ఉన్నాయని ప్రధాని మోదీ సోషల్‌ మీడియా ప్లాట్‌ఫారం ‘ఎక్స్‌’లో పేర్కొన్నారు.
 

గాయపడిన వారు త్వరగా కోలుకోవాలని ప్రార్థిస్తున్నానని ప్రధాని పేర్కొన్నారు. ప్రధాని మోదీ బెంగళూరు తొక్కిసలాట మృతుల కుటుంబాలకు రూ. రెండు లక్షల పరిహారం ప్రకటించారు. క్షతగాత్రులకు రూ. 50 పరిహారం అందజేయనున్నట్లు తెలిపారు. గాయపడినవారికి వెంటనే మెరుగైన వైద్య సహాయం అందించాలని అధికారులను కోరారు.
 
చిన్నస్వామి స్టేడియం ప్రాంగణానికి సమీపంలో ఉన్న డ్రెయిన్‌పై ఉంచిన తాత్కాలిక స్లాబ్‌పైకి భారీగా జనం చేరడంతో అది కూలిపోయిందని తెలుస్తోంది. ఫలితంగా తొక్కిసలాట జరగగా, 11 మంది మృతిచెందారు. పలువురు గాయపడ్డారు. కర్ణాటక రాష్ట్ర క్రికెట్ అసోసియేషన్ నిర్వహించిన ఈ కార్యక్రమానికి జనం విపరీతంగా తరలివచ్చారు. అభిమానులు తమ క్రికెట్‌ జట్టు హీరోలను చూసేందుకు తెగ ఆసక్తి చూపించారు.

Advertisement
 
Advertisement
Advertisement