
మధురై: కదంబ వన రాణి మీనాక్షి అమ్మవారు తమిళనాడులోని మధురైలో కొలువై ఉన్నారు. ప్రస్తుతం మీనాక్షి అమ్మవారి ఆలయంలో నవరాత్రి వేడుకలు వైభవంగా జరుగుతున్నాయి. మీనాక్షి దేవాలయం పాండ్య దేవాలయాలలో ప్రముఖమైనదిగా వెలుగొందుతోంది.
ప్రపంచ ప్రఖ్యాతి గాంచిన మధుర మీనాక్షి సుందరేశ్వర్ ఆలయానికి మనదేశం నుంచే కాకుండా విదేశాల నుండి ప్రతిరోజూ వేలాది మంది భక్తులు తరలి వస్తుంటారు. మీనాక్షి ఆలయంలో నవరాత్రుల సందర్భంగా శమీ మందిరం రెండవ ప్రాకారంలో ఘనమైన అలంకారం చేశారు. నవరాత్రులలో ఎనిమిదవ రోజున అమ్మవారు మహిషాసురమర్థిని అలంకారంలో భక్తులకు దర్శనమిచ్చారు. ఉత్సవాలలో భాగంగా ప్రతిరోజు సాయంత్రం ఆరు గంటలకు మూలస్థాన గర్భగుడిలోని మీనాక్షి అమ్మవారికి అభిషేకం, అలంకరణలు నిర్వహించి కల్పపూజ, సహస్రనామ పూజలు నిర్వహిస్తున్నారు.
ఇది కూడా చదవండి: కామాఖ్య అమ్మవారి దర్శనంలో టీవీ రాముడు
#madurai | மதுரை மீனாட்சி அம்மன் கோவிலில் நவராத்திரி 8-வது நாள் விழாவை முன்னிட்டு மகிஷாசுரமர்த்தினி அலங்காரத்தில் எழுந்தருளி அருள்பாலித்தார்.#spiritual | @SRajaJourno | @k_for_krish | @imanojprabakar | @JSKGopi @LKGPONNU @kasaayam | #மீனாட்சியம்மன் @LPRABHAKARANPR3 @abplive pic.twitter.com/8EwLquBYV3
— arunchinna (@arunreporter92) October 22, 2023