కామాఖ్య అమ్మవారి దర్శనంలో టీవీ రాముడు | Gurmeet Choudhary Visit Kamakhya Mandir | Sakshi
Sakshi News home page

కామాఖ్య అమ్మవారి దర్శనంలో టీవీ రాముడు

Oct 23 2023 7:43 AM | Updated on Oct 23 2023 7:43 AM

Gurmeet Choudhary Visit Kamakhya Mandir - Sakshi

టీవీ నటుడు గుర్మీత్ చౌదరి దుర్గాష్టమి రోజున అసోంలోని కామాఖ్య ఆలయాన్ని సందర్శించారు. ఈ సందర్భంగా గుర్మీత్‌ సోషల్ మీడియాలో పలు ఫోటోలు షేర్‌ చేశారు. ఈ ఫోటోలలో గుర్మీత్ కండువా కప్పుకుని, నుదుటన తిలకం ధరించడాన్ని చూడవచ్చు. గుర్మీత్‌ అమ్మవారి భక్తిలో మునిగిపోయినట్లు కనిపించారు. ఫోటోలు షేర్‌ చేసిన గుర్మీత్ చౌదరి క్యాప్షన్‌లో..‘జై మా కామాఖ్య. అందరికీ అష్టమి శుభాకాంక్షలు’ అని రాశారు.

గుర్మీత్.. కామాఖ్య ఆలయాన్ని సందర్శించిన ఫోటోలు వైరల్ అవుతున్నాయి. ఆయన ఆలయం వెలుపల అభిమానులతో ఫొటోలు కూడా దిగారు. కాగా ఈ ఫోటోల్లో గుర్మీత్ ఒంటరిగా కనిపిస్తున్నారు. భార్య డెబినా బెనర్జీ, కుమార్తెలు లియానా, దివిషా అతని వెంట లేరు. గుర్మీత్ టీవీలో ప్రసారమైన రామాయణం సీరియల్‌లో రాముడి పాత్రలో కనిపించారు. ఈ షో ద్వారా గుర్మీత్‌కు మంచి పేరు వచ్చింది. అతనిని అభిమానించేవారి సంఖ్య కూడా పెరిగింది. ప్రస్తుతం గుర్మీత్ పలు సినిమాల్లో బిజీగా ఉన్నారు. 
ఇది కూడా చూడండి: యూట్యూబ్‌లో మొదటి వీడియో ఏది? ఎంతమంది చూశారు?

Advertisement
 
Advertisement
Advertisement