హార్మూజ్‌ను దాటి భారత్‌ వైపు... | 11 India-bound ships have successfully crossed the Strait of Hormuz | Sakshi
Sakshi News home page

హార్మూజ్‌ను దాటి భారత్‌ వైపు...

Jun 24 2026 1:47 AM | Updated on Jun 24 2026 1:47 AM

11 India-bound ships have successfully crossed the Strait of Hormuz

11 నౌకలు వస్తున్నాయన్న విదేశాంగ శాఖ

న్యూఢిల్లీ: పశ్చిమాసియా సంక్షోభానికి ముగింపు పలుకుతూ అమెరికా, ఇరాన్‌ల మధ్య కుదిరిన డీల్‌తో భారత జెండా కలిగిన 11 నౌకలు హార్మూజ్‌ను దాటేశాయని విదేశాంగ శాఖ మంగళవారం తెలిపింది. భారతీయ జెండా కలిగిన 10 నౌకలు ఇప్పటికీ పర్షియన్‌ గల్ఫ్‌ ప్రాంతంలోనే ఉన్నాయి. తాజాగా, వాటికి మరో రెండు జతయ్యాయి’అని విదేశాంగ శాఖ ప్రతినిధి రణ«దీర్‌జైశ్వాల్‌ మీడియాకు తెలిపారు.

అమెరికా, ఇరాన్‌ డీల్‌ కుదిరిన తర్వాత 11 నౌకలు హార్మూజ్‌ను దాటేశాయన్నారు. వీటిలో 2.85 లక్షల మెట్రిక్‌ టన్నుల ముడి చమురు కలిగిన మూడు ట్యాంకర్లు ఉన్నాయని వివరించారు. వీటితోపాటు విదేశీ జెండాలు కలిగిన ఒక ఎల్పీజీ నౌక, మరో ముడిచమురు ట్యాంకర్‌ కూడా ఉన్నాయి. ఇవికాకుండా, ఎరువులతో వస్తున్న ఆరు విదేశీ నౌకలున్నాయన్నారు. మిగతా నౌకలు కూడా త్వరలోనే హార్మూజ్‌ను దాటే అవకాశాలున్నాయని జైశ్వాల్‌ పేర్కొన్నారు.  

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement