స్కూళ్లను పేల్చేస్తాం.. గుజరాత్‌లో బాంబు బెదిరింపులు | 10 Gujarat Schools Municipal Corporation Get Bomb Threats | Sakshi
Sakshi News home page

స్కూళ్లను పేల్చేస్తాం.. గుజరాత్‌లో బాంబు బెదిరింపులు

Oct 7 2026 4:36 PM | Updated on Oct 7 2026 4:44 PM

10 Gujarat Schools Municipal Corporation Get Bomb Threats

అహ్మదాబాద్: గుజరాత్‌లో మరోసారి బాంబు బెదిరింపులు కలకలం రేపాయి. నగరంలోని పలు పాఠశాలలు, అహ్మదాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ (AMC) కార్యాలయాన్ని బాంబులతో పేల్చివేస్తామని ఈ-మెయిల్ ద్వారా బెదిరింపులు వచ్చాయి. సమాచారం అందుకున్న వెంటనే పోలీసులు, బాంబు నిర్వీర్య బృందాలు సంబంధిత ప్రాంతాలకు చేరుకున్నాయి.

అయితే, పాఠశాలలు కూడా ముందు జాగ్రత్త చర్యలుగా విద్యార్థులను ఇళ్లకు పంపించాయి. ఇప్పటివరకు తనిఖీ చేసిన ప్రాంతాల్లో ఎలాంటి అనుమానాస్పద వస్తువులు కనిపించలేదు. అహ్మదాబాద్‌లో 10 పాఠశాలలను లక్ష్యంగా చేసుకున్నట్లు తెలుస్తోంది. వేజల్‌పూర్‌లోని జైడస్ స్కూల్, శాటిలైట్‌లోని బోడక్‌దేవ్ స్కూల్ ఫర్ చిల్డ్రన్, ఛరోడిలోని ఎస్‌జీవీపీ స్కూల్, సంత్ కబీర్ స్కూల్, డ్రైవ్-ఇన్ రోడ్‌లోని ఏషియా స్కూల్, మెమ్నగర్‌లోని హెచ్‌బీకే స్కూళ్లకు బెదిరింపులు వచ్చాయి. ఈ పాఠశాలలను ఉదయం 11.11 గంటలకు పేల్చివేస్తామంటూ హెచ్చరికలు వచ్చాయి.

ఈ బెదిరింపులు పాఠశాలలకే పరిమితం కాలేదు. అహ్మదాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ (AMC) కార్యాలయాన్ని మధ్యాహ్నం 1.11 గంటలకు పేల్చివేస్తామని కూడా ఈ-మెయిల్ ద్వారా హెచ్చరిక వచ్చింది. సమాచారం అందుకున్న వెంటనే అహ్మదాబాద్ ఫైర్ బ్రిగేడ్, పోలీసులు, బాంబు స్క్వాడ్ సిబ్బంది ఏఎంసీ కార్యాలయానికి చేరుకుని విస్తృత తనిఖీలు చేపట్టారు. భద్రతా సిబ్బంది కార్యాలయంలోకి ప్రవేశించే ప్రతి ఒక్కరినీ క్షుణ్ణంగా తనిఖీ చేశారు.

ఇటీవల వరుస బెదిరింపుల నేపథ్యంలో అహ్మదాబాద్, గాంధీనగర్ ప్రాంతాల్లో ఆందోళనలు మరింత పెరిగాయి. గత కొన్ని వారాల్లో కూడా ఇలాంటి ఈ-మెయిల్ బెదిరింపులు వచ్చాయి. సెప్టెంబర్ 10న, గుజరాత్ శాసనసభ, గాంధీనగర్ కోర్టు, అహ్మదాబాద్‌లోని పాఠశాలలను లక్ష్యంగా చేసుకుని బాంబు దాడులు చేస్తామని బెదిరింపులు వచ్చిన సంగతి తెలిసిందే.

ఇదీ చదవండి: రెండు తలల పాము రూ.కోటి

 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement