పీఏసీలో పార్టీ అంతర్గత
వ్యవహారాలపై చర్చ..
నారాయణపేట: కాంగ్రెస్ పార్టీని అధికారంలోకి తీసుకురావడానికి పదేళ్లపాటు కష్టపడి పనిచేసిన ప్రతి నాయకుడు, కార్యకర్తను అధిష్టానం గుర్తించి సముచిత స్థానం కల్పిస్తుందని సీడబ్ల్యూసీ సభ్యు డు, మాజీ ఎమ్మెల్యే డా. చల్లా వంశీచంద్‌రెడ్డి అన్నా రు. బుధవారం జిల్లాకేంద్రంలోని ఓ ఫంక్షన్‌హాల్‌లో కాంగ్రెస్‌పార్టీ జిల్లా కార్యవర్గం, బ్లాక్, మండల, పట్టణ అధ్యక్షుల సమావేశం నిర్వహించగా ఆయన ముఖ్యఅతిథిగా హాజరై డీసీసీ కార్యవర్గ సభ్యులను సన్మానించి నియామక పత్రాలు అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. పార్టీ కోసం కష్టపడుతున్న ప్రతి నాయకుడు, కార్యకర్తకు తగిన గుర్తింపు లభించేలా అధిష్టానం దృష్టికి తీసుకెళ్లి న్యాయం చేస్తామని తెలిపారు. బీజేపీ చేస్తున్న మత రాజకీయాలను కాంగ్రెస్ శ్రేణులు తిప్పికొట్టి ప్రజలకు వాస్తవాలను వివరించాలని సూచించారు. బీఆర్‌ఎస్ పాలనతో రాష్ట్ర ఆర్థిక పరిస్థితి దెబ్బతిన్నప్పటికీ కాంగ్రెస్ ప్రభుత్వం సంక్షే మ పథకాలను కొనసాగిస్తూ కొత్త పథకాలను అమలు చేస్తోందన్నారు. అర్హులైన ప్రతి ఒక్కరికీ సంక్షేమ పథకాలు అందేలా కార్యకర్తలు కృషి చేయాలని, ప్రభుత్వ కార్యక్రమాలను సోషల్ మీడియా ద్వారా విస్తృతంగా ప్రజల్లోకి తీసుకెళ్లాలని సూచించారు. రాష్ట్రం, కేంద్రంలో కాంగ్రెస్‌ను బలోపేతం చేసి రాహుల్‌గాంధీని ప్రధానిని చేసేందుకు నాయకులు, కార్యకర్తలు సమష్టిగా పనిచేయాలని కోరారు.
గ్రామస్థాయి నుంచి బలోపేతం చేయాలి..
కాంగ్రెస్‌పార్టీని గ్రామస్థాయి నుంచి మరింత బలోపేతం చేసేందుకు నాయకులు, కార్యకర్తలు సమన్వయంతో పనిచేయాలని డీసీసీ అధ్యక్షుడు కె.ప్రశాంత్‌కుమార్‌రెడ్డి అన్నారు. పార్టీ కార్యక్రమాలను క్షేత్రస్థాయిలో విస్తృతంగా నిర్వహిస్తూ ప్రజలతో నిరంతరం మమేకం కావాలని సూచించారు. సంక్షేమ పథకాలు అర్హులకు చేరేలా కార్యకర్తలు చొరవ చూపాలని కోరారు.
పార్టీ కోసం పనిచేసిన ప్రతి ఒక్కరికీ సముచిత స్థానం
ీ సడబ్ల్యూసీ సభ్యుడు
చల్లా వంశీచంద్‌రెడ్డి
అంతకుముందు డీసీసీ అధ్యక్షుడు కె.ప్రశాంత్‌కుమార్‌రెడ్డి అధ్యక్షతన జిల్లా కాంగ్రెస్ రాజకీయ వ్యవహారాల కమిటీ (పీఏసీ) సమావేశం జరిగింది. పార్టీ అంతర్గత వ్యవహారాలపై చర్చించారు. ఎమ్మెల్యేలు, మంత్రులతో సమన్వయం చేసుకుంటూ పార్టీ నాయకులు, కార్యకర్తలు పనిచేసేలా పీఏసీ సభ్యులు చొరవ తీసుకోవాలని చల్లా వంశీచందర్‌రెడ్డి సూచించారు. ప్రతి నెల రెండో శనివారం జిల్లా, మండల, గ్రామస్థాయిలో పీఏసీ సమావేశాలు తప్పనిసరిగా నిర్వహించాలని, క్షేత్రస్థాయిలో కార్యకర్తలతో మాట్లాడి వారి సమస్యలను తెలుసుకోవాలని కోరారు. వరుసగా మూడు సమావేశాలకు కారణం లేకుండా గైర్హాజరయ్యే సభ్యులకు నోటీసులు జారీచేసి కమిటీ నుంచి తొలగించాలని సూచించారు. కార్యక్రమంలో జిల్లా గ్రంథాలయాల సంస్థ చైర్మన్ వార్ల విజయ్‌కుమార్, మార్కెట్ కమిటీ చైర్మన్‌న్ శివారెడ్డి, పార్టీ జిల్లా ప్రధానకార్యదర్శి ఎండీ సలీం, అనుబంధ సంఘాల అధ్యక్షులు, జిల్లా కార్యవర్గసభ్యులు, మండల, బ్లాక్ అధ్యక్షులు తదితరులు పాల్గొన్నారు.


