పోలీసులు అప్రమత్తంగా ఉండాలి | - | Sakshi
Sakshi News home page

పోలీసులు అప్రమత్తంగా ఉండాలి

Sep 25 2026 1:29 AM | Updated on Sep 25 2026 1:29 AM

నారాయణపేట: గణేష్‌ నిమజ్జన వేడుకలు ప్రశాంతంగా, సజావుగా జరిగేలా సిబ్బంది అప్రమత్తంగా విధులు నిర్వర్తించాలని డీఎస్పీ నల్లపు లింగయ్య సూచించారు. గురువారం పట్టణంలోని శిలా గార్డెన్స్‌లో నిమజ్జన బందోబస్తు విధులకు హాజరైన పోలీసు అధికారులు, సిబ్బందికి ఆయన పలు సూచనలు చేశారు. జిల్లాకేంద్రంలో సుమారు 120 విగ్రహాల నిమజ్జనం నేపథ్యంలో ఎలాంటి అవాంఛనీయ ఘటనలకు తావులేకుండా అధికారులు, సిబ్బంది సమన్వయంతో విధులు నిర్వర్తించాలని ఆదేశించారు. శోభాయాత్ర మార్గం నుంచి కొండారెడ్డిపల్లి చెరువు వరకు సీసీ కెమెరాలతో నిఘా ఏర్పాటు చేసినట్లు తెలిపారు. ట్రాఫిక్‌కు అంతరాయం కలగకుండా, భక్తులకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా చర్యలు చేపట్టాలని సూచించారు. నిమజ్జన బందోబస్తును 10 సెక్టార్లుగా విభజించి 260 మంది పోలీసు అధికారులు, సిబ్బందితో పటిష్ట భద్రతా ఏర్పాట్లు చేసినట్లు డీఎస్పీ వెల్లడించారు. కొండారెడ్డిపల్లి చెరువు వద్ద చిన్నారులు, వృద్ధుల భద్రతపై ప్రత్యేక దృష్టి సారించాలని సూచించారు. భారీ విగ్రహాలను కృష్ణానదిలో నిమజ్జనం చేసేందుకు వెళ్లే మార్గంలో ప్రత్యేక బందోబస్తు, పెట్రోలింగ్‌ ఏర్పాటు చేసినట్లు తెలిపారు. సమావేశంలో సీఐ శివశంకర్‌, ఎస్‌ఐ వెంకటేశ్వర్లు పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement