పడక్బందీగా ధాన్యం సేకరణ | - | Sakshi
Sakshi News home page

పడక్బందీగా ధాన్యం సేకరణ

Sep 25 2026 1:29 AM | Updated on Sep 25 2026 1:29 AM

నారాయణపేట: జిల్లాలో ధాన్యం సేకరణను తొలిరోజు నుంచే పకడ్బందీగా చేపట్టాలని కలెక్టర్‌ సీహెచ్‌ ప్రియాంక అధికారులను ఆదేశించారు. కలెక్టరేట్‌లో గురువారం నిర్వహించిన సమావేశంలో ఆమె మాట్లాడారు. రైతులకు ఇబ్బందులు లేకుండా సకాలంలో కొనుగోళ్లు పూర్తయ్యేలా ముందస్తు ఏర్పాట్లు చేయాలన్నారు. కొనుగోలు కేంద్రాలకు స్థలాలు, సిబ్బంది, హమాలీలు, పరికరాలను ముందుగానే సిద్ధం చేయాలని సూచించారు. జీపీఎస్‌, హమాలీల వివరాల నమోదు, ఆన్‌లైన్‌ వ్యవసాయ డేటా ఇంటిగ్రేషన్‌ను సమర్థంగా అమలు చేయాలన్నారు. జిల్లాలోని గోదాముల నిల్వ సామర్థ్యాన్ని పరిశీలించి, అవసరమైతే కర్ణాటక సరిహద్దు ప్రాంతాల్లోని గోదాములను వినియోగించుకునే అవకాశాలను పరిశీలించాలని ఆదేశించారు. శాఖలన్నీ సమన్వయంతో పారదర్శకంగా ధాన్యం సేకరణ చేపట్టాలని సూచించారు.

వృద్ధుల భద్రత సామాజిక బాధ్యత

వృద్ధుల సంక్షేమం, భద్రత, చట్టబద్ధమైన హక్కులపై ప్రజల్లో విస్తృత అవగాహన కల్పించాలని కలెక్టర్‌ సీహెచ్‌ ప్రియాంక సూచించారు. అంతర్జాతీయ వయోవృద్ధుల దినోత్సవ వారోత్సవాల్లో భాగంగా గురువారం కలెక్టరేట్‌లో అవగాహన పోస్టర్లు, ‘ఎల్డర్‌ గైడ్‌’ను ఆవిష్కరించారు. వృద్ధులను గౌరవించడం, వారి అవసరాలను గుర్తించి సహాయం అందించడం ప్రతి ఒక్కరి సామాజిక బాధ్యత అన్నారు. వారు గౌరవప్రదంగా, సురక్షితంగా జీవించేలా అన్ని వర్గాలు బాధ్యతగా వ్యవహరించాలని సూచించారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement