నారాయణపేట ఎడ్యుకేషన్: జిల్లాలోని ప్రభుత్వ, స్థానిక సంస్థల పాఠశాలల్లో విద్యాబోధనకు ఆటంకం కలగకుండా 151 మంది విద్యావలంటీర్లను నాలుగు నెలల పాటు తాత్కాలిక ప్రాతిపదికన నియమించనున్నట్లు జిల్లా విద్యాధికారి డా. గోవిందరాజు శనివారం ఒక ప్రకటనలో తెలిపారు. ఈ మేరకు 6వ తేదీన నోటిఫికేషన్ విడుదల చేశామని.. 141 మందిని గుర్తించిన పాఠశాలల్లో ఖాళీలకు అనుగుణంగా నియమించనుండగా, మిగిలిన 10 మందిని ప్యానల్ తనిఖీ బృందానికి ఉపాధ్యాయులను కేటాయించిన పాఠశాలల్లో సర్దుబాటు చేయనున్నామని పేర్కొన్నారు. దామరగిద్ద–14, ఉట్కూర్–8, గుండుమాల్–3, మరికల్–2, మాగనూర్–22, ధన్వాడ–12, కొత్తపల్లి–7, కృష్ణా–13, నారాయణపేట–28, నర్వ–3, మక్తల్–18, మద్దూర్లో 11 ఖాళీలున్నాయని.. 9వ తేదీ నుంచి 13వ తేదీ సాయంత్రం 5 వరకు సంబంధిత మండల విద్యాధికారి కార్యాలయాల్లో దరఖాస్తు చేసుకోవాలని సూచించారు. ఆసక్తిగల అభ్యర్థులు నిర్దేశిత దరఖాస్తు నమూనాతో పాటు విద్యార్హత ధ్రువపత్రాలు సమర్పించాలన్నారు.


