నిమజ్జనానికి నీటికష్టాలు | - | Sakshi
Sakshi News home page

నిమజ్జనానికి నీటికష్టాలు

Sep 24 2026 2:24 AM | Updated on Sep 24 2026 2:24 AM

భక్తులకు పోలీసుల సూచనలు.. ఇంటిగ్రేటెడ్‌ కంట్రోల్‌ రూమ్‌లు..

శాంతియుతంగా నిర్వహించాలి..

● ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన

బారికేడ్లను దాటకూడదు.

● ప్రతి విగ్రహం వెంట కనీసం

నలుగురు పెద్దలు ఉండాలి.

● అనుమతి లేని ప్రాంతాల్లో

నీటిలోకి దిగకూడదు.

● చిన్నారులను చెరువు,

నది వైపు ఒంటరిగా పంపకూడదు.

● నిర్దేశించిన ప్రదేశాల్లోనే విగ్రహాలను

నిమజ్జనం చేయాలి.

● వాహనాలపై పరిమిత సంఖ్యలో

ప్రయాణించాలి.

● క్రేన్లు, పడవలు, స్విమ్మర్ల విధులకు

ఆటంకం కలిగించొద్దు.

● విద్యుత్‌ వైర్లు, లైటింగ్‌ వద్ద

అప్రమత్తంగా ఉండాలి.

● మద్యం తాగి శోభాయాత్రలో పాల్గొనడం,

వాహనాలు నడపడం నిషేధం.

● తప్పిపోయిన పిల్లలు, వృద్ధులు

కనిపిస్తే పోలీసులకు సమాచారం ఇవ్వాలి.

–8లో u

నారాయణపేట: జిల్లాకేంద్రంలో 11 రోజులుగా భక్తిశ్రద్ధలతో పూజలందుకున్న గణనాథులు గురువారం రాత్రి నుంచి నిమజ్జనానికి తరలనున్నారు. నిమజ్జనాన్ని పురస్కరించుకొని మండపాల నిర్వాహకులు వాహనాలను రంగురంగుల పూలు, విద్యుద్దీపాలు, వివిధ రకాల అలంకరణలతో పోటాపోటీగా ముస్తాబు చేస్తున్నారు. జిల్లాకేంద్రం సమీపంలోని కొండారెడ్డిపల్లి చెరువులో నీటిమట్టం తక్కువగా ఉండటంతో 10 అడుగులకు పైబడిన భారీ విగ్రహాలను కృష్ణానదిలో నిమజ్జనం చేయాలని అధికారులు సూచిస్తున్నారు. జిల్లాకేంద్రంలో సుమారు 150కి పైగా విగ్రహాలు ప్రతిష్టించగా.. అందులో భారీ విగ్రహాలు అధికంగా ఉన్నట్లు అధికారులు గుర్తించారు. పెద్ద విగ్రహాలను చెరువులో నిమజ్జనం చేయడంతో ఎదురయ్యే ఇబ్బందులను దృష్టిలో ఉంచుకొని ఎస్పీ డా. జి. వినీత్‌ ఉత్సవ కమిటీలు, మండపాల నిర్వాహకులతో మంగళవారం ప్రత్యేక సమావేశం నిర్వహించి తగిన సూచనలు చేశారు. భక్తుల భద్రతకు ప్రాధాన్యమిస్తూ నిమజ్జన ఏర్పాట్లను ముందుగానే పూర్తి చేయాలని అధికారులను ఆదేశించారు.

నిర్వాహకులకు పెద్ద సవాలే..

భారీ వినాయక విగ్రహాలను కృష్ణానదికి తరలించడం మండపాల నిర్వాహకులకు పెద్ద సమస్యగా మారింది. సాధారణ వాహనాల్లో విగ్రహాలను తరలించే అవకాశం లేకపోవడంతో ప్రత్యేక వాహనాలు, క్రేన్‌ సమకూర్చుకోవాల్సిన పరిస్థితి ఏర్పడింది. నారాయణపేట–మక్తల్‌ రహదారి గుంతలమయంగా ఉండటంతో కర్ణాటకలోని యాద్గిర్‌ మార్గంలోని షాదీపూర్‌ మీదుగా కృష్ణా మండలంలోని హిందూపూర్‌ సమీపంలోని కృష్ణానదికి విగ్రహాలను తీసుకెళ్లాలని అధికారులు సూచించారు. దీంతో నిర్వాహకులకు రవాణా ఖర్చులు, దూరభారం గణనీయంగా పెరుగుతోంది. ఇప్పటికే విగ్రహాల కొనుగోలుకు భారీగా ఖర్చు చేసిన నిర్వాహకులు నిమజ్జనానికి మరోసారి వేలాది రూపాయలు వెచ్చించాల్సి వస్తోందని చెబుతున్నారు. ప్రభుత్వమే ప్రత్యేక వాహనాలు, క్రేన్లు సమకూర్చి భారీ విగ్రహాల తరలింపునకు సహకరించాలని మండపాల నిర్వాహకులు కోరుతున్నారు.

భద్రతే ప్రధాన లక్ష్యం..

పోలీసు, రెవెన్యూ, మున్సిపల్‌ అధికారులు సమన్వయంతో నిమజ్జన ఏర్పాట్లు చేస్తున్నారు. భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా బారికేడ్లు, విద్యుత్‌ దీపాలు, తాగునీరు, పారిశుద్ధ్య చర్యలు చేపట్టనున్నారు. విగ్రహాలను సురక్షితంగా నిమజ్జనం చేసేందుకు అవసరమైన ఏర్పాట్లు చేస్తున్నారు. భారీ విగ్రహాల తరలింపునపై ప్రత్యేక దృష్టి సారిస్తున్నారు.

పటిష్ట బందోబస్తు.. గణేష్‌ శోభాయాత్ర, నిమజ్జ నం ప్రశాంతంగా నిర్వహించేందుకు జిల్లా పోలీస్‌ యంత్రాంగం పటిష్ట బందోబస్తు కల్పిస్తోంది. జిల్లాలో సుమారు 800 మంది సిబ్బందిని మోహరించారు. విధుల్లో అదనపు ఎస్పీ, ఇద్దరు డీఎస్పీలు, 16 మంది సీఐలు, 31 మంది ఎస్సైలు, 156 మంది ఏఎస్సై/హెచ్‌సీలు, 347 మంది పోలీస్‌ కానిస్టేబుళ్లు, 116 మంది హోంగార్డులు, మూడు టీజీపీఎస్‌ ప్లటూన్లు పాల్గొననున్నాయి.

నారాయణపేట, మక్తల్‌, కోస్గి పట్టణాల్లో ఇతర శాఖల అధికారుల సమన్వయంతో ఇంటిగ్రేటెడ్‌ కంట్రోల్‌ రూమ్‌లు ఏర్పాటు చేశారు. శోభాయాత్ర, నిమజ్జనాన్ని నిరంతరం పర్యవేక్షిస్తూ పరిస్థితులకు అనుగుణంగా తక్షణమే స్పందించేలా ఏర్పాట్లు చేశారు. శోభాయాత్ర జరిగే మార్గాలు, నిమజ్జన ప్రాంతాల్లో సీసీ కెమెరాలతో నిఘా ఏర్పాటు చేశారు. డ్రోన్‌ కెమెరాలు, వీడియోగ్రఫీ ద్వారా శోభాయాత్రను రికార్డు చేస్తూ నిరంతరం పర్యవేక్షించనున్నారు. పోలీస్‌, రెవెన్యూ, మున్సిపల్‌, ఇతర శాఖల అధికారులు సమన్వయంతో భద్రతా ఏర్పాట్లు పర్యవేక్షించనున్నారు.

గణేష్‌ నిమజ్జన కార్యక్రమం ప్రశాంతంగా, సురక్షితంగా జరిగేలా ఉత్సవ కమిటీలు, మండపాల నిర్వాహకులు పోలీస్‌శాఖకు పూర్తి సహకారం అందించాలి. భక్తులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా అన్ని ఏర్పాట్లను సమన్వయంతో చేపడుతున్నాం. – డా. వినీత్‌, ఎస్పీ

కొండారెడ్డిపల్లి చెరువులో తక్కువ నీటిమట్టం

భారీ విగ్రహాలు కృష్ణానదిలోనే..

సొంత ఖర్చులతో తరలించాలంటున్న అధికారులు

క్రేన్లు, పడవలు, గజ ఈతగాళ్లతో

పటిష్ట భద్రత

నేడు గణనాథుల నిమజ్జనం

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement