పీఆర్సీ ప్రకటించకుంటే ఉద్యమమే.. | - | Sakshi
Sakshi News home page

పీఆర్సీ ప్రకటించకుంటే ఉద్యమమే..

Sep 24 2026 2:24 AM | Updated on Sep 24 2026 2:24 AM

నారాయణపేట: ప్రభుత్వం వెంటనే పీఆర్సీ ప్రక టించకపోతే నాలుగైదు రోజుల్లో ఉద్యమ కార్యాచరణకు దిగుతామని పీఆర్టీయూ టీఎస్‌ రాష్ట్ర ప్రధానకార్యదర్శి సుంకరి భిక్షంగౌడ్‌ హెచ్చరించారు. బు ధవారం జిల్లాకేంద్రంలోని ఓ గార్డెన్‌న్స్‌లో నిర్వహించిన పీఆర్టీయూ టీఎస్‌ జిల్లా సర్వసభ్య కౌన్సిల్‌ సమావేశానికి సంఘం జిల్లా అధ్యక్షుడు వై.జనార్దన్‌రెడ్డి అధ్యక్షత వహించగా.. ఆయన ముఖ్యఅతిథి గా హాజరై మాట్లాడారు. ఉద్యోగ, ఉపాధ్యాయుల సమస్యలపై ప్రభుత్వం సాగదీత దోరణి అవలంబిస్తోందని విమర్శించారు. జేఏసీ ఆధ్వర్యంలో చర్య లు లేకుంటే పీఆర్టీయూ టీఎస్‌ స్వతంత్రంగా ఉద్యమ బాట పడుతుందని హెచ్చరించారు. ఉద్యో గ, ఉపాధ్యాయ సంఘాలతో ప్రభుత్వం జరిపిన చర్చలు అసంపూర్తిగా ముగియడం, అసంతృప్తి నెలకొనేలా వ్యవహరించడం దురదృష్టకరమన్నా రు. ప్రభుత్వం పీఆర్సీపై స్పష్టమైన ప్రకటన చే యాలని డిమాండ్‌ చేశారు. జేఏసీ ఆధ్వర్యంలో త్వ రలో కార్యాచరణ ప్రకటించాలని కోరుతామని, స్పందన లేకపోతే పీఆర్టీయూ టీఎస్‌ సంఘం పక్షాన ఉద్యమానికి సిద్ధమవుతామని స్పష్టం చేశారు. ఎన్నికల సమయంలో ముఖ్యమంత్రి ఇచ్చి న హామీలు, మేనిఫెస్టోలో పేర్కొన్న అంశాలను అమలు చేయాలని కోరారు. ఉద్యోగుల నుంచి డబ్బులు తీసుకుంటూ హెల్త్‌ కార్డుల సదుపాయా న్ని సక్రమంగా అమలు చేయకపోవడం సరికాదన్నారు. ఆరోగ్య పథకాన్ని ప్రభుత్వం సమర్థవంతంగా అమలు చేయలేని పరిస్థితి ఉంటే ఉద్యోగులకు 1.5 శాతం అదనంగా చెల్లించాలని డిమాండ్‌ చేశా రు. సీపీఎస్‌ను రద్దుచేసి పాత పింఛన్‌ విధానాన్ని అమలు చేయాలని కోరారు. ఇటీవల నిర్వహించిన ఉత్తమ ఉపాధ్యాయుల కార్యక్రమంలో ముఖ్యమంత్రి సెప్టెంబర్‌ 1న జరిగిన ధర్నాపై ప్రస్తావించడం పీఆర్టీయూ చేపట్టిన ఉద్యమానికి లభించిన గుర్తింపుగా భావిస్తున్నామని తెలిపారు. జిల్లాలో పీఆర్టీయూ సంఘ బలోపేతానికి రాష్ట్ర సంఘం పూర్తి సహకారం అందిస్తుందన్నారు. సమావేశంలో సంఘం జిల్లా ప్రధానకార్యదర్శి పి.వెంకట్‌రెడ్డి, మాజీ జిల్లా అధ్యక్షుడు నర్సింహారెడ్డి, గౌరవ అధ్యక్షుడు తిరుపతి, వివిధ మండలాల అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు రఘువీర్‌, సత్యనారాయణరెడ్డి, గోవర్ధన్‌, సూర్యప్రకాశ్‌, శ్రీకాంత్‌, గోపాల్‌రెడ్డి, వెంకటేష్‌, దండు శేఖర్‌, నవీన్‌, ప్రకాష్‌గౌడ్‌, శ్రీనివాసరావు, వాణిశ్రీ తదితరులు పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement