ఉత్సవాలతో ఐక్యత చాటాలి : ఎస్పీ | - | Sakshi
Sakshi News home page

ఉత్సవాలతో ఐక్యత చాటాలి : ఎస్పీ

Sep 24 2026 2:24 AM | Updated on Sep 24 2026 2:24 AM

నారాయణపేట: గణేష్‌ ఉత్సవాలను భక్తిశ్రద్ధలతో నిర్వహిస్తూ ఐక్యత, సోదరభావాన్ని చాటాలని ఎస్పీ డా. వినీత్‌ కోరారు. మండలంలోని కోటకొండలో బుధవారం నిర్వహించిన గణేష్‌ నిమజ్జన వేడుకలకు ఆయన ముఖ్యఅతిథిగా హాజరై గణపతికి ప్రత్యేక పూజలు నిర్వహించిన అనంతరం గ్రామస్తులు, గణేష్‌ ఉత్సవ కమిటీ సభ్యులు, యువతతో కలిసి నిమజ్జన శోభాయాత్రను తిలకించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. కోటకొండ ఐక్యత, సామరస్యానికి చిరునామాగా నిలుస్తోందని.. గ్రామంలో 58 వినాయక విగ్రహాలను ఏర్పాటు చేసి ప్రజలంతా కలిసి భక్తిశ్రద్ధలతో ఉత్సవాలు నిర్వహించడం అభినందనీయమన్నారు. పోలీసుశాఖ సూచనలు పాటిస్తూ శోభాయాత్రలో డీజేలను వినియోగించకుండా సహకరించిన గ్రామస్తులు, ఉత్సవ కమిటీలు, యువతను ప్రత్యేకంగా అభినందించారు. ప్రజల భద్రత, శాంతిభద్రతల పరిరక్షణకు పోలీసుల విజ్ఞప్తిని గౌరవించిన ప్రతి ఒక్కరికీ కృతజ్ఞతలు తెలిపారు. శోభాయాత్రలో ఎలాంటి అవాంఛనీయ ఘటనలకు తావులేకుండా పోలీసులకు సహకరించాలని, యువత బాధ్యతాయుతంగా వ్యవహరించాలని కోరారు. గణేష్‌ నిమజ్జనం ప్రశాంతంగా, సురక్షితంగా పూర్తయ్యేలా అవసరమైన బందోబస్తు, భద్రతా ఏర్పాట్లు చేపట్టినట్లు తెలిపారు. ఎస్పీ వెంట రూరల్‌ ఎస్‌ఐ సతీష్‌రెడ్డి, బీజేపీ నాయకులు పగుడాకుల శ్రీనివాసులు, విశ్వహిందూ పరిషత్‌ ప్రచార ప్రముఖ్‌ పగడాకుల భాగస్వామి, పూజారి శాంతానంద్‌, గణేష్‌ ఉత్సవ కమిటీ సభ్యులు, గ్రామ పెద్దలు, యువత, గ్రామ ప్రజలు పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement