రెండేళ్ల తర్వాత ఓటీటీలోకి వచ్చేస్తున్న హిట్‌ సినిమా | Zwigato Movie Streaming Date Locked | Sakshi
Sakshi News home page

రెండేళ్ల తర్వాత ఓటీటీలోకి వచ్చేస్తున్న హిట్‌ సినిమా

Oct 10 2024 5:08 PM | Updated on Oct 10 2024 5:11 PM

Zwigato Movie Streaming Date Locked

బాలీవుడ్‌లో స్టాండప్‌ కమెడియన్‌గా ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న కపిల్‌ శర్మ నటించిన జ్విగాటో సినిమా ఓటీటీలోకి వచ్చేస్తుంది. నందిత దాస్‌ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ  చిత్రాన్ని అప్లాజ్‌ ఎంటర్‌టైన్‌మెంట్‌ నిర్మించింది. షహానా గోస్వామి హీరోయిన్‌గా నటించింది. 2022లో విడుదలైన ఈ చిత్రం సుమారు రెండేళ్ల తర్వాత ఓటీటీలో రిలీజ్‌ కానుంది.

భువనేశ్వర్‌ నేపథ్యంలో సాగే ఫుడ్‌ డెలివరీ బాయ్‌ కథ ఇది. జ్విగాటో మూవీలో సాధారణ ప్రజల జీవితాన్ని ఎంతో అద్బుతంగా డైరెక్టర్‌ నందిత దాస్‌ చూపించారు.  అయితే,  ఈ సినిమా టొరంటో అంతర్జాతీయ చిత్రోత్సవం, బుసాన్‌ అంతర్జాతీయ చిత్రోత్సవం వంటి వేదికలపై ప్రదర్శితమైంది. తాజాగా ఓటీటీలో విడుదల చేస్తున్నట్లు అమెజాన్‌ ప్రైమ్‌ అధికారికంగా ప్రకటించింది. అక్టోబర్ 25 నుంచి  స్ట్రీమింగ్ కానుందని అమెజాన్ ప్రైమ్  ఒక పోస్టర్‌ను పంచుకుంది.

సాధారణ కుటుంబానికి చెందిన ఒక వ్యక్తి ఫ్యాక్టరీలో మేనేజర్‌గా పనిచేస్తూ ఉద్యోగం కోల్పోయాక ఫుడ్ డెలివరీ ఏజెంట్‌గా మారాల్సి వస్తుంది. అయితే, ఈ క్రమంలో అతను ఎలాంటి సవాళ్లు ఎదుర్కొంటాడనేది అసలు కధ. ఈ సినిమాకు రివ్యూస్‌ కూడా పాజిటివ్‌గానే వచ్చాయి. ఐఎండీబీలో రేటింగ్‌ కూడా మెరుగ్గానే ఉంది.

Advertisement
 
Advertisement
Advertisement