వీకెండ్‌లో సినిమాల జాతర.. ఒక్క రోజే ఏకంగా పది చిత్రాలు! | This Weekend Ott Movie Releases List Goes Viral In Social Media | Sakshi
Sakshi News home page

This Weekend Ott Movies: ఒక్క రోజే పది సినిమాలు స్ట్రీమింగ్.. ఆ రెండే కాస్తా స్పెషల్‌!

Jun 6 2024 7:48 PM | Updated on Jun 6 2024 8:23 PM

This Weekend Ott Movie Releases List Goes Viral In Social Media

మరో వీకెండ్‌ వచ్చేస్తోంది. ఇప్పుడిప్పుడే ఎన్నికల హడావుడి ముగిసింది. శుక్రవారం వస్తోందంటే చాలు బాక్సాఫీస్‌తో పాటు ఓటీటీలపై అందరి దృష్టి ఉంటుంది. కొత్త సినిమాలు ఏం వస్తున్నాయో అన్న ఆసక్తి ప్రతి ఒక్కరిలో ఉంటుంది. ఎప్పటిలాగే ఈ వీకెండ్‌లో కొత్త సినిమాలు, సిరీస్‌లు సందడి చేసేందుకు వస్తున్నాయి.

హన్సిక నటించిన 105 మినిట్స్‌, మిరల్‌ లాంటి సినిమాలు ఓటీటీకి రానున్నాయి. వీటితో పాటు తమిళ, మలయాళ చిత్రాలు, పలు వెబ్ సిరీస్‌లు స్ట్రీమింగ్ కానున్నాయి. మరి ఏయే సినిమా.. ఎక్కడ స్ట్రీమింగ్ ఆ వివరాలపై ఓ లుక్కేద్దాం. మీకిష్టమైన చిత్రాలు ఓటీటీలో చూసేయండి.

  • నెట్‌ఫ్లిక్స్
  • హైరార‍్కీ- (కొరియన్ వెబ్ సిరీస్‌)- జూన్‌ 07
  • హిట్ మ్యాన్‌-(హాలీవుడ్‌ మూవీ)- జూన్ 07
  • ఫెర్ఫెక్ట్ మ్యాచ్ సీజన్ 2 (ఇంగ్లీష్ సిరీస్) - జూన్ 07

ఆహా

  • 105 మినిట్స్‌- (తెలుగు హారర్‌ మూవీ)- జూన్ 07
  • మిరల్-(తెలుగు సినిమా)- జూన్ 07
  • బూమర్ అంకుల్(తమిళ సినిమా)- జూన్ 07

సోని లివ్

  • వర్షంగాలక్కు శేషం- (మలయాళ సినిమా)- జూన్‌ 07
  • గుల్లక్‌ 4- హిందీ (వెబ్ సిరీస్‌)- జూన్‌ 07

జియో సినిమా

  • బ్లాక్ ఔట్ (హిందీ మూవీ) - జూన్ 07
  • ద ఎండ్ వుయ్ స్టార్ట్ ఫ్రమ్ (ఇంగ్లీష్ సినిమా) - జూన్ 08

బుక్‌ మై షో

ఎబిగైల్ (ఇంగ్లీష్ మూవీ)- జూన్ 07

 

Advertisement
 
Advertisement
Advertisement