మాస్‌ కా దాస్‌ దూకుడు.. రెండు రోజుల్లో ఎన్ని కోట్లంటే? | Vishwak Sen Gangs of Godavari box office collection on day 2 | Sakshi
Sakshi News home page

Gangs of Godavari Collections: బాక్సాఫీస్ వద్ద విశ్వక్‌ సేన్‌ జోరు.. రెండు రోజుల్లో ఎన్ని కోట్లంటే?

Jun 2 2024 12:02 PM | Updated on Jun 2 2024 12:48 PM

Vishwak Sen Gangs of Godavari box office collection on day 2

యంగ్ హీరో విశ్వక్ సేన్‌, డీజే టిల్లు భామ నేహా శెట్టి జంటగా నటించిన చిత్రం గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి. కృష్ణ చైతన్య దర్శకత్వంలో తెరెకెక్కించిన ఈ చిత్రం ఈనెల 31న థియేటర్లలో రిలీజైంది. సితార ఎంటర్‌టైన్‌మెంట్ బ్యానర్‌లో సూర్యదేవర నాగవంశీ నిర్మించారు. తొలిరోజు నుంచే పాజిటివ్‌ టాక్ రావడంతో బాక్సాఫీస్ వద్ద కలెక్షన్ల వర్షం కురిపిస్తోంది. మొదటి రోజే రూ.5.2 కోట్ల నెట్‌ వసూళ్లు రాగా..  రూ.8.2  కోట్ల  గ్రాస్ ‍కలెక్షన్స్‌ రాబట్టింది.

రెండో రోజు సైతం గ్యాంగ్స్‌ ఆఫ్ గోదావరి అదే జోరును కొనసాగించింది. కాస్తా తగ్గినప్పటికీ రూ.3 కోట్ల నెట్‌ వసూళ్లు సాధించింది.  దీంతో రెండు రోజుల్లోనే రూ.8.2  కోట్ల నికర కలెక్షన్స్‌ రాగా.. రూ.11.30 కోట్ల  గ్రాస్‌ వసూళ్లు రాబట్టింది. ఇదే జోరు కొనసాగితే మరికొద్ది రోజుల్లోనే బ్రేక్ ఈవెన్‌ సాధించే అవకాశముంది. కాగా.. గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి చిత్రం థియేటర్లలో శనివారం 25.89 శాతం ఆక్సుపెన్సీతో నడిచాయి. కాగా.. ఈ చిత్రంలో అంజలి కీలక పాత్రలో కనిపించారు. ఈ సినిమాకు యువన్ శంకర్ రాజా సంగీతమందించారు.

Advertisement
 
Advertisement
Advertisement