ఎన్నో పోరాటాలు చేశాం: విజయ్‌ దేవరకొండ | Vijay Deverakonda Wishes Ranabaali Director Rahul Sankrityan On Birthday | Sakshi
Sakshi News home page

ఎన్నో పోరాటాలు చేశాం: విజయ్‌ దేవరకొండ

Jun 30 2026 4:36 AM | Updated on Jun 30 2026 4:37 AM

 Vijay Deverakonda Wishes Ranabaali Director Rahul Sankrityan On Birthday

విజయ్‌ దేవరకొండ హీరోగా నటిస్తున్న చిత్రం ‘రణబాలి’. రాహుల్‌ సంకృత్యాన్‌ దర్శకత్వం వహిస్తున్నారు. ఈ మూవీలో రష్మిక మందన్నా హీరోయిన్‌గా నటిస్తున్నారు. టీ సిరీస్‌ సమర్పణలో నవీన్‌ యెర్నేని, వై. రవిశంకర్‌ నిర్మిస్తున్న ఈ మూవీ సెప్టెంబరు 11న విడుదల కానుంది. ఇదిలా ఉంటే... సోమవారం (జూన్‌ 29) రాహుల్‌ సంకృత్యాన్‌ పుట్టినరోజు.

ఈ సందర్భంగా విజయ్‌ దేవరకొండ సోషల్‌ మీడియా ద్వారా స్పందిస్తూ– ‘‘మనం (రాహుల్‌ని ఉద్దేశించి) ‘టాక్సీవాలా’ సినిమా చేసి తొమ్మిదేళ్లవుతోంది. ఇన్నేళ్లలో మనం జీవితంలో ఎంతో మారిపోయాం. అర్థవంతమైన కథలు రాయాలనే తపన, వాటిని అందంగా తెరకెక్కించాలనే ఇష్టం నీలో ఏమాత్రం తగ్గలేదు. మనం కలిసి చేసింది రెండు చిత్రాలే అయినా ఎన్నో పోరాటాలు చేశాం. మొదటి చిత్రానికి ప్రేక్షకుల ప్రేమ, ఆదరణ అందుకున్నాం. ‘రణబాలి’తో మరో విజయం సాధించాలి’’ అని రాసుకొచ్చారు.

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement