విజయ్ దేవరకొండ రణబాలి.. ఆ ప్రచారంపై చర్యలు తీసుకోండి..! | Vijay Deverakonda’s Team Refutes Fake Social Media Claims Regarding Excessive Crew And Caravan Demands For Raanabali Shoot | Sakshi
Sakshi News home page

Vijay Devarakonda: విజయ్ దేవరకొండ రణబాలి.. ఆ వార్తలపై టీమ్ క్లారిటీ..!

Jun 25 2026 9:08 PM | Updated on Jun 26 2026 1:52 PM

Vijay Devarakonda team Responds On Social Media Fake news

ప్రస్తుతం విజయ్ దేవరకొండ రణబాలి షూటింగ్‌తో బిజీగా ఉన్నారు. ఈ మూవీని రాయలసీమ బ్యాక్‌డ్రాప్‌లో రాహుల్ సంకృత్యాన్‌ తెరకెక్కిస్తున్నారు. ఈ చిత్రంలో రష్మిక మందన్నా హీరోయిన్‌గా కనిపించనుంది. ప్రస్తుతం ఈ మూవీ షూటింగ్ శరవేగంగా జరుగుతోంది. ఈ నేపథ్యంలోనే విజయ్ దేవరకొండ సినిమాపై సోషల్ మీడియాలో ఫేక్ ప్రచారం జరుగుతోంది.

తాజాగా విజయ్ దేవరకొండ వస్తోన్న దుష్ప్రచారంపై ఆయన టీమ్ స్పందించింది. రణబాలి మూవీ నిర్మాతలకు భారం పెరిగేలా వ్యవహరిస్తున్నారంటూ సోషల్ మీడియాలో కొందరు పోస్టులు పెడుతున్నారు. విజయ్ 50 నుంచి 60 మంది అసిస్టెంట్స్ కావాలని.. మినిమం 5 లేదా ఆరు క్యారవాన్స్ అడుగుతున్నారని డిమాండ్ చేస్తున్నారనే ప్రచారం జరుగుతోంది. ఈ డిమాండ్స్ భరించలేక మైత్రీ సంస్థ ప్రొడ్యూసర్ కౌన్సిల్‌లో ఫిర్యాదు చేసిందంటూ తప్పుడు పోస్టులు చేస్తున్నారు. కొన్ని సంస్థలు ఇలాంటి వార్తలు రాసి పోస్టులు చేస్తున్నారు. దీంతో ఇవన్నీ నిజమని నమ్మించే ప్రయత్నం చేస్తున్నారు.

ఈ నేపథ్యంలోనే విజయ్ దేవరకొండ టీమ్ ఫుల్ క్లారిటీ ఇచ్చేసింది. సోషల్ మీడియాలో వస్తున్న అసత్య వార్తలు నమ్మవద్దని ప్రేక్షకులకు విజ్ఞప్తి చేసింది. విజయ్ ఎప్పుడూ ప్రొడ్యూసర్స్ మంచిని కోరే హీరోగానే ఉన్నాడని వెల్లడించింది. ఇలాంటి ఫేక్ న్యూస్ క్రియేట్ చేసి పోస్టులు చేస్తున్న వారిపై తమ సంస్థల పేర్లు, లోగోలు ఫోర్జరీ చేస్తున్నందుకు ఆయా సంస్థలపై సైబర్ క్రైమ్ పోలీసులు చర్యలు తీసుకుని చట్టపరంగా శిక్షించాలని విజయ్ టీమ్ కోరింది.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement