నాన్‌స్టాప్‌ నవ్వులు ఆరంభం | VenkyAnil5 - NKRAR2 Pooja Ceremony | Sakshi
Sakshi News home page

నాన్‌స్టాప్‌ నవ్వులు ఆరంభం

Jun 19 2026 12:46 AM | Updated on Jun 19 2026 12:46 AM

VenkyAnil5 - NKRAR2 Pooja Ceremony

కీర్తి సురేష్, వెంకటేశ్, అనిల్‌ రావిపూడి, కల్యాణ్‌ రామ్, కృతి శెట్టి

వెంకటేశ్, కల్యాణ్‌ రామ్‌ హీరోలుగా అనిల్‌ రావిపూడి దర్శకత్వంలో రూపొందనున్న సినిమా ‘వెంకీఅనిల్‌5 అండ్‌ ఎన్‌కేఆర్‌ఏఆర్‌ 2’ (వర్కింగ్‌ టైటిల్‌). ఈ చిత్రంలో వెంకటేశ్‌ సరసన కీర్తి సురేష్, కల్యాణ్‌ రామ్‌కు జోడీగా కృతి శెట్టి నటించనున్నారు. జీ స్టూడియోస్, అర్చన, సురేష్‌ ప్రొడక్షన్స్‌ సమర్పణలో సాహు గారపాటి నిర్మిస్తున్న ఈ సినిమా వచ్చే సంక్రాంతికి విడుదల కానుంది.

గురువారం హైదరాబాద్‌లో ఈ సినిమా పూజా కార్యక్రమాలు జరిగాయి. ముహూర్తపు సన్నివేశానికి నిర్మాత డి. సురేష్‌బాబు కెమెరా స్విచ్చాన్‌ చేయగా, నిర్మాత అల్లు అరవింద్‌ క్లాప్‌ ఇచ్చారు. దర్శకుడు కె. రాఘవేంద్ర రావు గౌరవ దర్శకత్వం వహించారు. నిర్మాతలు ‘దిల్‌’ రాజు, శిరీష్‌ కలిసి నిర్మాత సాహు గారపాటికి స్క్రిప్ట్‌ అందించారు.

‘‘దర్శకుడు అనిల్‌ రావిపూడి శైలితో కూడిన నాన్‌స్టాప్‌ నవ్వులు, వినోదంతో కూడిన సినిమా ఇది. వెంకటేశ్, కల్యాణ్‌ రామ్‌ల క్రేజీ కాంబినేషన్‌ ఈ సినిమాపై అంచనాలను పెంచింది. వచ్చే సంక్రాంతి పండగ సీజన్‌లో ప్రేక్షకులు ఆసక్తిగా ఎదురు చూసే ఎంటర్‌టైనింగ్‌ మూవీస్‌లో ఇది ఒకటిగా నిలుస్తుంది. అతి త్వరలోనే ఈ సినిమా రెగ్యులర్‌ షూటింగ్‌ని ఆరంభిస్తాం’’ అని యూనిట్‌ పేర్కొంది. ఈ చిత్రానికి సంగీతం: జీవీ ప్రకాష్‌కుమార్‌.

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement