ఎన్నికల్లో పోటీ చేసిన మొదటిసారే గెలుపు రుచి చూశారు దళపతి విజయ్. పోటీ చేసిన రెండు స్థానాల్లో గెలవడంతో పాటు తమిళనాడు రాష్ట్ర ముఖ్యమంత్రిగా బాధ్యతలు స్వీకరించి సంచలనం సృష్టించారు. అయితే విజయ్ సీఎం అయినప్పటి నుంచి ఆయన వ్యక్తిగత విషయాలు సోషల్ మీడియాలో హాట్ టాపిక్ అవుతున్నాయి. ఓపక్క భార్యకు విడాకులు ఇస్తూనే.. మరోపక్క హీరోయిన్ త్రిషతో సన్నిహితంగా మెదులుతున్నారు.
తప్పేముంది?
ఈ క్రమంలో త్రిష కూడా రాజకీయాల్లోకి రాబోతోందని ప్రచారం జరుగుతోంది. ఈ ప్రచారంపై నటి వనితా విజయకుమార్ స్పందించింది. త్రిష రాజకీయాల్లోకి వస్తే తప్పేంటని ప్రశ్నించింది. పాలిటిక్స్‌లో అడుగుపెట్టేందుకు కావాల్సిన అన్ని అర్హతలు తనకు ఉన్నాయని త్రిషను వెనకేసుకొచ్చింది. పైగా దివంగత ముఖ్యమంత్రి జయలలిత చదివిన స్కూల్‌లోనే త్రిష కూడా చదువుకుందని గుర్తు చేసింది.
రాజకీయాల్లోకి రావాలి
తను ఇంగ్లీష్ అనర్గళంగా మాట్లాడుతుందని, జనంతో ఎలా మమేకం అవాలి? ఎదుటివారితో ఎంత గౌరవంగా మెదలాలనే విషయాలు తనకు బాగా తెలుసని పేర్కొంది. త్రిష లాంటి వారు రాజకీయాల్లోకి వస్తేనే బాగుంటుందని అభిప్రాయపడింది. మరి నిజంగా త్రిష పాలిటిక్స్‌లో ఎంట్రీ ఇస్తుందా? కేవలం సినిమాలకే పరిమితమవుతుందా? అన్నది రానున్న రోజుల్లో చూడాలి!


