Urvashi Rautela Shares Cryptic Post After Rishabh Pant Meets With Road Accident - Sakshi
Sakshi News home page

Urvashi Rautela: 'ప్రార్థిస్తున్నా'..రిషభ్‌ పంత్‌కు ప్రమాదం తర్వాత ఊర్వశీ తొలిసారి పోస్ట్‌

Dec 30 2022 3:17 PM | Updated on Dec 30 2022 4:37 PM

Urvashi Rautela Shares Cryptic Post After Rishabh Pant Accident - Sakshi

టీమిండియా స్టార్‌ క్రికెటర్‌ రిషభ్‌ పంత్‌ రోడ్డు ప్రమాదానికి గురైన సంగతి తెలిసిందే. కాగా స్వస్థలం ఉత్తరాఖండ్‌ నుంచి ఢిల్లీకి వస్తున్న సమయంలో.. రూర్కీ సమీపంలోని నర్సన్‌ సరిహద్దు వద్ద ఈ ప్రమాదం జరిగింది.  అతడు ప్రయాణిస్తున్న కారు యాక్సిడెంట్‌కు గురైన తర్వాత పూర్తిగా దగ్ధమైయ్యింది. ఈ ప్రమాదంలో తీవ్ర గాయాలపాలైన రిషభ్‌ పంత్‌ అదృష్టవశాత్తూ ప్రాణాలతో బయటపడ్డాడు.

ప్రస్తుతం డెహ్రాడూన్‌లోని మాక్స్‌ ఆస్పత్రిలో చికిత్స జరుగుతోంది. ఇక పంత్‌ త్వరగా కోలుకోవాలని పలువురు అభిమానులు ప్రార్థనలు చేస్తున్నారు. తాజాగా నటి ఊర్వశీ రౌతేలా సైతం పంత్‌ యాక్సిడెంట్‌ప తనదైన శైలిలో స్పందించింది. పేరు ప్రస్తావించకుండా.. ప్రార్థిస్తున్నాను అంటూ ఇన్‌స్టాగ్రామ్‌లో ఓ పోస్టును షేర్‌ చేసింది. ఊర్వశీ పోస్ట్‌పై చాలామంది ఫ్యాన్స్‌ పంత్‌ త్వరగా కోలుకోవాలంటూ కామెంట్స్‌ చేస్తున్నారు.

కాగా ఊర్వశీ-రిషభ్‌ పంత్‌ మధ్య గత కొన్నిరోజులుగా సోషల్‌ మీడియాలో కోల్డ్‌వార్‌ నెలకొన్న సంగతి తెలిసిందే. తనకోసం ఓ హోట్‌లో ఆర్పీ చాలా సేపు ఎదురుచూశాడని ఊర్వశీ పేర్కొనగా.. కొంతమంది పబ్లిసిటీ కోసం ఇలాంటి చీప్‌ ట్రిక్స్‌ వాడతారని, ఇలాంటి వాళ్లనే చేస్తే జాలేస్తుందని రిషభ్‌ పంత్‌ ఊర్వశీని ఉద్దేశిస్తూ ఆ మధ్య పోస్ట్‌ చేసిన సంగతి విధితమే. 

Advertisement
 
Advertisement
Advertisement