స్టార్ హీరో ఇంట్లోకి చొరబాటు.. ఇద్దరు అనుమానితులు అరెస్ట్ | Two Unknown Persons Arrested At Salman Khan's Farmhouse | Sakshi
Sakshi News home page

Salman Khan: సల్మాన్ ఇంటి దగ్గర టెన్షన్.. వాళ్లని అరెస్ట్ చేసిన పోలీసులు

Jan 8 2024 3:07 PM | Updated on Jan 8 2024 3:12 PM

Two Unknown Persons Arrested At Salman Khan Farm House - Sakshi

స్టార్ హీరో ఇంటి దగ్గర అలజడి. అభిమానులు అని చెప్పిన ఇద్దరు అనుమానితులు.. బలవంతంగా సదరు హీరో ఇంట్లోకి చొరబడే ప్రయత్నం చేశారు. దీంతో అంతా టెన్షన్ టెన్షన్‌గా మారిపోయింది. సీన్‌లోకి ఎంటరైన పోలీసులు.. ఇద్దరు అజ్ఞాత వ్యక్తుల్ని అరెస్ట్ చేశారు. అసలు వాళ్లెవరు? ఇక్కడికొచ్చి ఎందుకు చొరబడే ప్రయత్నం చేశారని దర్యాప్తు చేసే పనిలో ఉన్నారు. ఇంతకీ అసలేం జరిగింది?

(ఇదీ చదవండి: బిడ్డని కోల్పోయిన 'జబర్దస్త్' కమెడియన్ అవినాష్)

బాలీవుడ్ స్టార్ హీరో సల్మాన్ ఖాన్.. ముంబయికి సమీపంలోని పాన్వెల్ ప్రాంతంలో ఫామ్ హౌస్ ఉంది. ఎప్పటికప్పుడు అక్కడికి వెళ్తుంటాడు. తాజాగా ఈ ఫామ్ హౌస్‪‌లోకి ఇద్దరు అనుమానితులు చొరబడే ప్రయత్నం చేశారు. సెక్యూరిటీ గార్డ్స్‌తోనూ వాదించారు. పోలీసులకు సమాచారం అందించగా వీళ్లని అదుపులోకి తీసుకున్నారు. అయితే సదరు వ్యక్తుల దగ్గర నకిలీ ఐడీ కార్డ్స్ ఉండటం పలు అనుమానాలు రేకెత్తిస్తోంది.

ఎందుకంటే గతంలో సల్మాన్ ఖాన్.. కృష్ణజింకలని వేటాడాడు. ఇందులో భాగంగానే గ్యాంగ్‌స్టర్ లారెన్స్ బిష్ణోయ్ నుంచి ఈ హీరోకి బెదిరింపు ఈ-మెయిల్స్ కూడా వచ్చాయి. గతేడాది ఇతడితో పాటు మరో ఇద్దరిపైనా కేసు పెట్టారు. గతంలో ఓ ఇంటర్వ్యూలో మాట్లాడిన బిష్ణోయ్.. సల్మాన్‌ని చంపడమే తన జీవిత లక్ష‍్యమని చెప్పుకొచ్చాడు. ఈ క్రమంలోనే తాజాగా ఇద్దరు అనుమానితులు.. సల్మాన్ ఇంటి దగ్గర కనిపించడం ఆందోళన కలిగించింది. అయితే వీళ్లు సల్మాన్‌ని చంపడానికి వచ్చారా? మరోదైనా కారణం ఉందా? అనేది తెలియాల్సి ఉంది.

(ఇదీ చదవండి: సడన్‌గా ఓటీటీలోకి వచ్చేసిన సల్మాన్ ఖాన్ కొత్త మూవీ)

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement