
వేతనాలు పెంచాలంటూ టాలీవుడ్ సిసీ కార్మికులు చేపట్టిన సమ్మె 14వ రోజుకు చేరింది. గతంలో చెప్పినట్లుగా 30 శాతం వేతనాలు పెంచితేనే సమ్మె విరమిస్తామని కార్మికులు అంటుంటే.. ‘పెంచేదే లే’ అని నిర్మాతలు చెబుతున్నారు. కార్మికుల యూనియన్లతో నిర్మాతలు చర్చలు జరిపినా.. సమస్యకు పరిష్కారం లభించలేదు. అటు యూనియన్ లీడర్లు, ఇటు నిర్మాతలు..ఎవరూ తగ్గడం లేదు. దీంతో ఈ సమస్య మెగాస్టార్ చిరంజీవి ఇంటికి చేరింది.
(చదవండి: కార్మికుల సమ్మె.. అక్కడివరకు పరిస్థితి రానివ్వొద్దు: నారాయణమూర్తి)
ఈ రోజుల సాయంత్రం నిర్మాతల బృందం మరోసారి చిరంజీవిని కలువనున్నారు. అలాగే సోమవారం సాయంత్రం ఫెడరేషన్ నాయకులతో చిరంజీవి భేటీ కానున్నారు. మంగళవారం రోజు నిర్మాతలు, ఫెడరేషన్ నాయకులతో కలిసి చిరంజీవీ సమావేశం ఏర్పాటు చేసే అవకాశం ఉంది. చిరంజీవితో భేటీ తర్వాత ఈ సమస్యకు ఒక పరిష్కారం లభించే అవకాశం ఉందని సినీ వర్గాలు అభిప్రాయపడుతున్నాయి.
