
గత కొన్నిరోజులుగా టాలీవుడ్ కార్మికులు సమ్మె చేస్తున్నారు. తమకు ఇచ్చే వేతనాలు 30 శాతం మేర పెంచాలని వర్కర్స్ కోరగా.. నిర్మాతలు వైపు నుంచి సానుకూల స్పందన అయితే రాలేదు. పలుమార్లు చర్చలు జరిగినప్పటికీ.. ఈ సమస్యకు పరిష్కారం దొరకట్లేదు. ఇది ఎప్పుడు ముగుస్తుందో తెలియట్లేదు. ఇలాంటి టైంలో పీపుల్స్ స్టార్ ఆర్.నారాయణమూర్తి స్పందించారు. తన అభిప్రాయాన్ని చెప్పుకొచ్చారు..
(ఇదీ చదవండి: 'కూలీ'తో సక్సెస్.. కాస్ట్‌లీ కారు కొన్న నటుడు సౌబిన్)
'సినీ కార్మికులు.. నిర్మాతలు కలసి చర్చించుకొని సమస్యను పరిష్కరించుకోవాలి. కార్మికులు అడుగుతున్న వేతనాలు నిర్మాతలు పెంచాలి. కార్మికులను గౌరవిస్తూ వాళ్ల హక్కులను కాపాడాలి. మూడు యూనియన్లకు వేతనాలు పెంచకుండా మిగతా యూనియన్లకు పెంచడం ఏమిటి? అందరితోపాటు వాళ్లకు పెంచాలి. నిర్మాతలు కోరుతున్న ఫ్లెక్సిబుల్ కాల్ షీట్ 9 నుంచి 9 గంటల విషయమై కార్మికులు కూడా ఆలోచించాలి. ప్రస్తుతం మారుతున్న జీవన విధానంలో 6 నుంచి 6 గంటల వరకు నిర్మాతలకు ఇబ్బంది అవుతోంది అందుకే ఫెడరేషన్ కూడా ఆలోచించాలి'
'త్వరగా ఇరువురు సమ్మె విరమించి మళ్లీ షూటింగ్స్‌తో కళకళ లాడాలి. కార్మికులు చర్చల ద్వారా సమస్య పరిష్కారం కాకపోతే నిరాహారదీక్ష చేస్తాం అని ఫెడరేషన్ సంఘాలు అంటున్నాయి. అక్కడివరకు పరిస్థితి రాకుండా చర్చల ద్వారా సమస్య పరిష్కరించుకోవాలి' అని నారాయణమూర్తి చెప్పారు. మరి ఇండస్ట్రీలోని ఈ సమస్యకు ఎప్పుడు ఎండ్ కార్డ్ పడుతుందో చూడాలి?
(ఇదీ చదవండి: అన్నా నేనే హీరోయిన్.. శ్రుతి హాసన్‌కి వింత అనుభవం)