Thapaswini Poonacha gets married to boyfriend Rakshath Muthanna - Sakshi
Sakshi News home page

Thapaswini Poonacha: మూడేళ్లుగా డేటింగ్‌.. సీక్రెట్‌గా పెళ్లి.. ఎట్టకేలకు వీడియో రిలీజ్‌..

Jul 13 2023 4:33 PM | Updated on Jul 13 2023 4:41 PM

Thapaswini Poonacha gets Married to Boy Friend Rakshath Muthanna - Sakshi

మన ప్రయాణం ఇప్పుడు పెళ్లి అనే రెండక్షరాల పదంతో మరింత అర్థవంతంగా మారింది. ఇది జరిగి నెల రోజులే అవుతుందేమో కానీ ఈ ప్రయాణం ఇప్పటికీ ఇలాగే కొనసాగాలి. ని

కన్నడ హీరోయిన్‌ తపస్విని పూనచ పెళ్లి పీటలెక్కింది. ప్రియుడు రక్షత్‌ ముత్తన్నతో ఏడడుగులు వేసింది. ఇరు కుటుంబాలు, అతి దగ్గరి బంధుమిత్రుల సమక్షంలో ఈ వివాహం జరిగింది. జీవితంలో కొత్త అధ్యాయాన్ని ప్రారంభించిన ఈ జంట గురువారం తమ పెళ్లి విషయాన్ని అభిమానులకు వెల్లడించింది. ఈ మేరకు ఓ వీడియో రిలీజ్‌ చేసింది తపస్విని.

'మా జీవితాల్లో ఎప్పటికీ గుర్తుండిపోయే సుమధుర క్షణాలు ఈ చిన్ని వీడియోలో.. గత మూడేళ్లుగా కొనసాగుతున్న మన ప్రయాణం ఇప్పుడు పెళ్లి అనే రెండక్షరాల పదంతో మరింత అర్థవంతంగా మారింది. ఇది జరిగి నెల రోజులే అవుతుందంటే నమ్మలేకపోతున్నాను. ఈ ప్రయాణం ఎప్పటికీ ఇలాగే కొనసాగాలి. నిన్ను ఎంతగానో ప్రేమిస్తున్నాను. ఈ వివాహ వేడుకకు వచ్చి దీన్ని మరింత అందంగా మార్చిన స్నేహితులు, బంధువులకు ప్రత్యేక కృతజ్ఞతలు' అని రాసుకొచ్చింది.

కాగా తపస్విని, రక్షత్‌ సాంప్రదాయ పద్ధతిలో పెళ్లి చేసుకున్నారు. హరికథ అల్ల గిరకథ అనే కామెడీ చిత్రంతో తపస్విని పూనచ హీరోయిన్‌గా పరిచయమైంది. గజరామ అనే రెండో సినిమాకు కూడా ఆమె సంతకం చేసింది. పెళ్లి సందడి పూర్తవగానే తిరిగి సెట్స్‌లో అడుగుపెట్టనుంది.

చదవండి: ఫోటోలో ఉన్న పిల్లవాడిప్పుడు స్టార్‌ హీరో, అతడి వెనకాల ఉన్న పాప అతడి భార్యే!
ఎక్కువమంది చూసిన ఇండియన్‌ సినిమా ఏదో తెలుసా? మీరనుకునేది కాదు!

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement