మిమిక్రీ ఆర్టిస్ట్‌ నుంచి స్టార్‌ హీరోగా.. ఈ సెలబ్రిటీ జంటను గుర్తుపట్టారా?

Unseen Photo of Sivakarthikeyan With His Wife Aarthi Childhood Moment - Sakshi

ఈ ఫోటోలో ఉన్నది ఎవరో గుర్తుపట్టారా? చిన్న బాబును ఎత్తుకున్న పిల్లాడు కోలీవుడ్‌లో టాప్‌ హీరో.. అతడి వెనకాల నుదుటన విభూతితో పింక్‌ డ్రెస్‌లో ఉన్న చిన్నారి ప్రస్తుతం అతడి భార్య! వీరిద్దరూ తమిళనాట సెలబ్రిటీ కపుల్‌.. ఇంకా అర్థం కాలేదా? అతడు శివకార్తికేయన్‌, ఆమె ఆర్తి. సోషల్‌ మీడియాలో ఈ దంపతుల చిన్ననాటి ఫోటో వైరల్‌ తెగ వైరలవుతోంది.

ఈ హీరో విషయానికి వస్తే.. శివకార్తికేయన్‌ మిమిక్రీ ఆర్టిస్ట్‌గా కెరీర్‌ ఆరంభించాడు. అందరి పెదాలపై నవ్వులు పూయించే టాలెంట్‌ కార్తికేయన్‌ సొంతం. ఇది గమనించిన స్నేహితులు ఓ కామెడీ షోలో పాల్గొనమని సూచించాడు. సరే, వారి మాట ఎందుకు కాదనాలి? అనుకున్నాడే ఏమో కానీ ఓ రాయేద్దామనుకున్నాడు. కళక్క పోవతు యారు అనే కామెడీ షోలో పార్టిసిపేట్‌ చేయగా అందరినీ ఆశ్చర్యంలో ముంచెత్తుతూ షో విజేతగా అవతరించాడు. ఆ తర్వాత షార్ట్‌ ఫిలింస్‌ చేశాడు.

ముగప్పుటగం, ఐడెంటిటీ, కురాహి 786, 360° వంటి లఘుచిత్రాలు చేశాడు. అతడిలోని ప్రతిభను గుర్తించిన ఏగన్‌ చిత్రబృందం అదే సినిమాలో శివకార్తికేయన్‌కు ఓ చిన్న రోల్‌ ఇచ్చింది. కానీ ఎడిటింగ్‌లో అతడి పాత్రను తీసేశారు. దీంతో వెండితెరపై కనిపించాలన్న అతడి కలకు ఆదిలోనే హంసపాదు పడింది. ఆ తర్వాత డైరెక్టర్‌ పాండిరాజ్‌ 'మెరీనా' సినిమాతో అతడిని వెండితెరకు హీరోగా పరిచయం చేశాడు. ఈ మూవీ శివకార్తికేయన్‌కు మంచి గుర్తింపు తీసుకురావడంతో ఇక వెనుదిరిగి చూసుకోలేదు. తక్కువకాలంలోనే స్టార్‌ హీరోగా పేరు గడించాడు. 

‘రెమో’, ‘కౌసల్యా కృష్ణ మూర్తి’ సినిమాలతో తెలుగు ప్రేక్షకులకూ దగ్గరయ్యాడు. త‌మిళంలో వరుస సినిమాలు చేస్తూ వీలు చిక్కినప్పుడల్లా తెలుగులో డబ్‌ చేస్తూ అటు కోలీవుడ్‌, ఇటు టాలీవుడ్‌లోనూ ఫ్యాన్‌ ఫాలోయింగ్‌ సంపాదించుకున్నాడు. హీరోగా, హోస్ట్‌గా, డబ్బింగ్‌ ఆర్టిస్ట్‌గా, సింగర్‌గా, నిర్మాతగానూ సత్తా చాటాడు. తన బంధువులమ్మాయి ఆర్తిని 2010 ఆగస్టు 27న పెళ్లి చేసుకున్నాడు. వీరికి కూతురు ఆరాధన, కుమారుడు గుగన్‌ దాస్‌ అని ఇద్దరు సంతానం. కౌసల్యా కృష్ణమూర్తి తమిళ వర్షన్‌ కనాలో శివకార్తికేయన్‌ తన కూతురితో కలిసి ఓ పాట పాడాడు. ప్రస్తుతం శివకార్తికేయన్‌ హీరోగా నటించిన మావీరన్‌ జూలై 14న రిలీజ్‌ కానుంది. అయాలన్‌ దీపావళికి ప్రేక్షకుల ముందుకు రానుంది.

చదవండి: క్యాస్టింగ్‌ కౌచ్‌ అనుభవాన్ని వెల్లడించిన సుచిత్రా కృష్ణమూర్తి
సెలబ్రిటీల బాడీగార్డు నెల జీతం లక్షల్లో.. ఏడాదికి కోట్లల్లోనే!

Read latest Movies News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram 

Read also in:
Back to Top