బాటిల్ విసిరిన ఆక‌తాయి.. సింగ‌ర్ రియాక్ష‌న్ ఇదే! | Sunidhi Chauhan Reacts as Fan Throws Water Bottle at Her In Dehradun Concert | Sakshi
Sakshi News home page

సింగ‌ర్‌పై బాటిల్ విసిరిన ఆక‌తాయి.. అయినా స‌హ‌నం కోల్పోకుండా..

Published Sun, May 5 2024 11:00 AM | Last Updated on Sun, May 5 2024 12:36 PM

Sunidhi Chauhan Reacts as Fan Throws Water Bottle at Her In Dehradun Concert

పాపుల‌ర్ సింగ‌ర్‌ సునిధి చౌహాన్ ఇటీవ‌ల డెహ్రాడూన్‌లోని ఓ కాలేజీ ఫంక్ష‌న్‌లో లైవ్ షోకు హాజ‌రైంది. త‌న మ‌ధుర గాత్రంతో శ్రోత‌ల‌ను ఉర్రూత‌లూగించింది. బాలీవుడ్ హిట్ సాంగ్స్ పాడుతూ అంద‌రిలో హుషారు నింపింది. అక్క‌డున్న‌వారిని త‌న‌తో క‌లిసి పాడ‌మ‌ని ఎంక‌రేజ్ చేసింది. ఇంత‌లో ఓ వ్య‌క్తి ఆమెపైకి వాట‌ర్ బాటిల్ విసిరాడు.

బాటిల్స్ విసిరితే ఏమొస్తుంది?
త‌న‌వైపుగా ఏదో వ‌స్తువు వ‌స్తోంద‌న్న విష‌యం గ‌మ‌నించి ఆమె రెండ‌డుగులు వెన‌క్కు వేసింది. అయినా పాట పాడ‌టం ఆప‌లేదు. కొన్ని సెక‌న్ల త‌ర్వాత ఆమె.. నాపై బాటిల్స్ విసిరితే ఏమొస్తుంది? ఈ షో ఆగిపోతుంది. ఈ షో ఆగిపోవాల‌నుకుంటున్నారా? అని అడిగింది. అందుకు అక్క‌డున్న జ‌నాలు వ‌ద్ద‌ని ముక్త‌కంఠంతో బ‌దులిచ్చారు. 

అదే ఉత్సాహం
దీంతో ఆమె అదే ఉత్సాహంతో షోని కంటిన్యూ చేసింది. ఈ షోకి సంబంధించిన ఫోటోల‌ను ఆమె త‌న ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్ చేసింది. త‌న‌కు అలాంటి చేదు అనుభ‌వం ఎదురైనా ప‌ట్టించుకోకుండా షో ముందుకు కొన‌సాగించిన సునిధి మంచిత‌నానికి నెటిజ‌న్లు ఫిదా అవుతున్నారు. ఆ స్థానంలో మ‌రెవ‌రైనా ఉంటే మైక్ అక్క‌డే ప‌డేసి వెళ్లిపోయేవార‌ని కామెంట్లు చేస్తున్నారు.

 

 

 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement
Advertisement
Advertisement