శ్రీలీలకి తెలుగులో ఛాన్సులు నిల్.. దీంతో ఏకంగా | Sreeleela Likely To Act In Karthi Upcoming Movie, Interesting Deets Inside | Sakshi
Sakshi News home page

Sreeleela: కోలీవుడ్‌లో సెటిలైపోతున్న శ్రీలీల?

May 6 2024 7:07 AM | Updated on May 6 2024 9:18 AM

Sreeleela Acts In Karthi New Movie Latest

డాక్టర్ కాబోయి యాక్టర్ అయ్యానని చాలామంది హీరోయిన్లు చెబుతుంటారు. కానీ డాక్టర్ కోర్స్ చదువుతూనే శ్రీలీల హీరోయిన్ అయిపోయింది. 'పెళ్లి సందడి' మూవీతో తెలుగులోకి ఎంట్రీ ఇచ్చింది. సినిమా సక్సెస్ కానప్పటికీ వరస అవకాశాలు ఈమెని వరించాయి. రవితేజ 'ధమాకా'తో రూ.100 కోట్ల హిట్ అందుకుంది. మహేష్ బాబుతో 'గుంటూరు కారం'లోనూ నటించి ఆకట్టుకుంది.

(ఇదీ చదవండి: సమంత షాకింగ్ పోస్ట్.. పెట్టి డిలీట్ చేసిందా?)

అయితే తెలుగులో వరస ఫ్లాప్స్ దెబ్బకు ఈమెకు టాలీవుడ్‌లో ఛాన్సులు కరువయ్యాయి. లేదంటే ఈమె వద్దనుకుందో తెలియదు గానీ మన సినిమాలు ఇప్పట్లో చేసే సూచనలు కనిపించట్లేదు. అదే టైంలో తమిళంలో విజయ్, అజిత్ చిత్రాల్లో నటించే అవకాశం వరించిందనే వార్తలు తెగ వైరల్ అయ్యాయి.

కాగా శ్రీలీలకు ఇప్పుడు మరో భారీ అవకాశం తలుపు తట్టినట్లు తెలిసింది. కార్తీ హీరోగా ప్రముఖ బాలీవుడ్ నిర్మాణ సంస్థ భారీ చిత్రాన్ని నిర్మించడానికి సన్నాహాలు చేస్తుందని, ఇందులో హీరోయిన్‌గా ఈమెని తీసుకోవాలని చూస్తున్నట్లు తెలుస్తోంది. ఒకవేళ ఇది నిజమై, మూవీ హిట్ అయితే మాత్రం తమిళంలో శ్రీలీల క్రేజ్ పెరగడం ఖాయం.

(ఇదీ చదవండి: సైబర్ మోసం.. తెలిసి మరీ లక్షలు పోగొట్టుకున్న నటుడి భార్య)

Advertisement
 
Advertisement
Advertisement