స్పైడర్ మ్యాన్ vs హల్క్.. కొత్త తెలుగు ట్రైలర్ రిలీజ్ | Spider Man Brand New Day Movie Trailer Telugu Latest | Sakshi
Sakshi News home page

Spider Man Brand New Day: యాక్షన్‌తో అదరగొట్టిన స్పైడర్ మ్యాన్.. ట్రైలర్ చూశారా?

Jun 18 2026 3:24 PM | Updated on Jun 18 2026 3:35 PM

Spider Man Brand New Day Movie Trailer Telugu Latest

ఒకప్పుడు స్పైడర్ మ్యాన్ సినిమాలంటే యమ క్రేజ్ ఉండేది. కానీ ఇప్పుడు చాలావరకు హైప్ తగ్గిందనే చెప్పొచ్చు. అయినా సరే ఎప్పటికప్పుడు ఈ ఫ్రాంచైజీలో కొత్త మూవీస్ వస్తూనే ఉంటాయి. వచ్చే నెల 30న థియేటర్లలో రాబోతున్న చిత్రం 'స్పైడర్ మ్యాన్ బ్రాండ్ న్యూ డే'. టామ్ హోలండ్, జెండాయా హీరోహీరోయిన్లుగా నటించారు. ఈ చిత్రం నుంచి తాజాగా మరో ట్రైలర్ రిలీజ్ చేశారు.

(ఇదీ చదవండి: ప్రెగ్నెన్సీ ప్రకటించిన టాలీవుడ్ హీరోయిన్)

మూడు నెలల క్రితం రిలీజ్ చేసిన ట్రైలర్‌లో నో వే హోమ్ సంఘటనల తర్వాత ప్రపంచానికి పీటర్ పార్కర్ ఎవరో తెలియని స్థితిలో న్యూయార్క్‌లో కొత్త జీవితాన్ని ప్రారంభించడం, స్పైడర్ మ్యాన్ శరీరంలో వచ్చిన జన్యు మార్పులకు కారణం లాంటివి చూపించారు. ఈసారి వచ్చిన ట్రైలర్‌లో మాత్రం హల్క్‌తో పాటు మరికొందరితో స్పైడీ చేసే ఫైట్స్ చూపించారు. ఇకపోతే ఇందులో హీరోహీరోయిన్లుగా నటించిన టామ్, జెండాయా నిజజీవితంలో పెళ్లి చేసుకోవడం విశేషం.

స్పైడర్ మ్యాన్ ఫ్రాంచైజీలో భాగంగా 2002లో మొదటి సినిమా వచ్చింది. తర్వాత 2004, 07, 12, 14, 17, 19, 21ల్లో మిగిలిన మూవీస్ వచ్చాయి. ఇప్పుడు వచ్చే చిత్రం బాక్సాఫీస్ దగ్గర ఎలాంటి ఫలితాన్ని అందుకుంటుందో చూడాలి?

(ఇదీ చదవండి: 'బాహుబలి' రమ్యకృష్ణ సెకండ్ లవ్)

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement