ఓటీటీలో క్రేజీ సిరీస్.. ఇప్పుడు రెండో సీజన్ రెడీ | Special Ops 2 Series OTT Streaming Details | Sakshi
Sakshi News home page

Special Ops 2: సైబర్ క్రైమ్‌తో థ్రిల్.. కొత్త సీజన్ స్ట్రీమింగ్ ఎప్పుడంటే?

Jun 16 2025 5:20 PM | Updated on Jun 16 2025 6:11 PM

Special Ops 2 Series OTT Streaming Details

ఇప్పుడంటే వెబ్ సిరీసుల హవా కాస్త తగ్గింది. లాక్ డౌన్ టైంలో మాత్రం పలు హిందీ సిరీసులు తెగ క్రేజ్ సొంతం చేసుకున్నాయి. వాటిలో ఒకటి 'స్పెషల్ ఓపీఎస్'. 2020 మార్చిలో తొలి సీజన్ రిలీజ్ కాగా.. మధ్యలో 1.5 పేరుతో ఓ నాలుగు ఎపిసోడ్స్ రిలీజ్ చేశారు. వ్యూయర్స్‌ని ఆకట్టుకున్నారు. ఇప్పుడు ఐదేళ్ల విరామం తర్వాత రెండో సీజన్‌ని సిద్ధం చేశారు. స్ట్రీమింగ్ డేట్ ప్రకటించడంతో పాటు ట్రైలర్‌ని కూడా విడుదల చేశారు.

(ఇదీ చదవండి: 'కన్నప్ప' చూసిన రజినీకాంత్.. విష్ణుతో ఏం చెప్పారంటే?)

కేకే మేనన్‌, కరణ్‌ థాకర్‌, వినయ్‌ పాఠక్‌, విపుల్‌ గుప్త తదితరులు కీలక పాత్రలు పోషించిన తొలి సీజన్‌కి నీరజ్‌ పాండే, శివమ్‌ నాయర్‌ దర్శకత్వం వహించారు. స్పై యాక్షన్‌ జానర్‌లో దీన్ని తెరకెక్కించారు. ఇప్పుడు రెండో భాగానికి నీరజ్ పాండే దర్శకత్వం వహిస్తూనే నిర్మాతగానూ వ్యవహరించారు. హిమ్మత్‌ సింగ్‌, అతని టీమ్‌ ఈసారి.. 'ఏఐ', 'సైబర్‌ క్రైమ్‌' నుంచి భారత్‌కు ఎదురయ్యే సవాళ్లతో పోరాటం చేయనుంది. అందుకు తగ్గట్లే ట్రైలర్ కూడా ఆసక్తికరంగా ఉంది. సిరీస్‌పై అంచనాలు పెంచుతోంది. జూలై 11 నుంచి హాట్‪‌స్టార్‌లో సిరీస్ స్ట్రీమింగ్ కానుంది.

రెండో సీజన్ కోసం ఇప్పటికే ఉన్నవాళ్లతో పాటు కొత్తగా పలువురు నటీనటులు చేరారు. అందులో సయామీఖేర్‌, ప్రకాశ్ రాజ్ తదితరులు ఉన్నారు. గతంలో వచ్చిన వాటితో పోలిస్తే ఈసారి మరింత థ్రిల్‌ పంచేలా సిరీస్‌ని తీర్చిదిద్దినట్లు అర్థమవుతోంది. ఇకపోతే ఈ వారం దాదాపు 22కి పైగా సినిమాలు-వెబ్ సిరీసులు పలు ఓటీటీల్లోకి రాబోతున్నాయి. వీటిలో స్ట్రెయిట్ తెలుగు మూవీస్ లేవు. కానీ పలు డబ్బింగ్, పరభాషా చిత్రాలు ఉండటం విశేషం.

(ఇదీ చదవండి: ఈ వారం ఓటీటీల్లో ఏకంగా 22 సినిమాలు రిలీజ్)

Advertisement
 
Advertisement
Advertisement