breaking news
Special Ops 1.5 Web Series
-
ఆసక్తికర వెబ్ సిరీస్ వాయిదా.. కొత్త స్ట్రీమింగ్ ఇదే!
గతంలో ఓటీటీ ప్రియులను ఆకట్టుకున్న వెబ్ సిరీస్ స్పెషల్ ఓపీఎస్. 2020 మార్చిలో తొలి సీజన్ రిలీజ్ కాగా.. ఆడియన్స్‌ను విపరీతంగా ఆకట్టుకుంది. ఆ తర్వాత 1.5 పేరుతో ఓ నాలుగు ఎపిసోడ్స్ కూడా రిలీజ్ చేశారు. దాదాపు ఐదేళ్ల గ్యాప్ తర్వాత మరోసారి ఓటీటీ ఆడియన్స్‌ను అలరించేందుకు వస్తున్నారు. ఇటీవలే స్పెషల్ ఓపీఎస్ సీజన్-2 ట్రైలర్ విడుదల చేసిన మేకర్స్.. స్ట్రీమింగ్ డేట్‌ను కూడా ప్రకటించారు. జూలై 11 నుంచే స్ట్రీమింగ్ కానుందని తెలిపారు.అయితే తాజాగా మేకర్స్ స్పెషల్ ఓపీఎస్-2 వెబ్ సిరీస్‌ను వాయిదా వేస్తున్నట్లు వెల్లడించారు. ఈ సందర్భంగా కొత్త స్ట్రీమింగ్ తేదీని కూడా రివీల్ చేశారు. ఈ నెల 18 నుంచి వెబ్ సిరీస్ అందుబాటులోకి వస్తుందని మేకర్స్ వీడియో ద్వారా తెలిపారు. కొన్నిసార్లు అన్ని మనచేతుల్లో ఉండవని అందుకే వాయిదా వేయాల్సి వచ్చిందని నటుడు కేకే మేనన్ పేర్కొన్నారు. మరికొన్ని రోజులు వెయిట్ చేయక తప్పదని ఆడియన్స్‌ను కోరారు. ఈ సారి అన్ని ఎపిసోడ్స్ ఓకేసారి స్ట్రీమింగ్ చేస్తామని తెలిపారు.కాగా.. ఈ వెబ్ సిరీస్‌లో కేకే మేనన్, కరణ్ థాకర్, వినయ్ పాఠక్, విపుల్ గుప్త కీలక పాత్రలు పోషించారు. స్పై యాక్షన్ జోనర్లో వచ్చిన ఈ సిరీస్ రెండో భాగానికి నీరజ్ పాండే దర్శకత్వం వహిస్తూనే నిర్మాతగానూ వ్యవహరించారు. హిమ్మత్ సింగ్, అతని టీమ్ ఈసారి.. 'ఏఐ', 'సైబర్ క్రైమ్' నుంచి భారత్‌కు ఎదురయ్యే సవాళ్లతో పోరాటం చేయనుంది. ఈ ఆసక్తికర వెబ్ సిరీస్ జూలై 18 నుంచి జియోహాట్‌స్టార్‌లో సిరీస్ స్ట్రీమింగ్ కానుంది. రెండో సీజన్లో సయామీఖేర్, ప్రకాశ్ రాజ్ లాంటి వాళ్లు కూడా ఉన్నారు.We understand you're on the edge of your seat, but thoda aur intezar and it’s going to be worth all the wait! #HotstarSpecials #SpecialOps2, all episodes streaming from July 18, only on #JioHotstar#SpecialOps2OnJioHotstar pic.twitter.com/ky15pZPgnh— JioHotstar (@JioHotstar) July 8, 2025 -
ఓటీటీలో క్రేజీ సిరీస్.. ఇప్పుడు రెండో సీజన్ రెడీ
ఇప్పుడంటే వెబ్ సిరీసుల హవా కాస్త తగ్గింది. లాక్ డౌన్ టైంలో మాత్రం పలు హిందీ సిరీసులు తెగ క్రేజ్ సొంతం చేసుకున్నాయి. వాటిలో ఒకటి 'స్పెషల్ ఓపీఎస్'. 2020 మార్చిలో తొలి సీజన్ రిలీజ్ కాగా.. మధ్యలో 1.5 పేరుతో ఓ నాలుగు ఎపిసోడ్స్ రిలీజ్ చేశారు. వ్యూయర్స్‌ని ఆకట్టుకున్నారు. ఇప్పుడు ఐదేళ్ల విరామం తర్వాత రెండో సీజన్‌ని సిద్ధం చేశారు. స్ట్రీమింగ్ డేట్ ప్రకటించడంతో పాటు ట్రైలర్‌ని కూడా విడుదల చేశారు.(ఇదీ చదవండి: 'కన్నప్ప' చూసిన రజినీకాంత్.. విష్ణుతో ఏం చెప్పారంటే?)కేకే మేనన్, కరణ్ థాకర్, వినయ్ పాఠక్, విపుల్ గుప్త తదితరులు కీలక పాత్రలు పోషించిన తొలి సీజన్‌కి నీరజ్ పాండే, శివమ్ నాయర్ దర్శకత్వం వహించారు. స్పై యాక్షన్ జానర్లో దీన్ని తెరకెక్కించారు. ఇప్పుడు రెండో భాగానికి నీరజ్ పాండే దర్శకత్వం వహిస్తూనే నిర్మాతగానూ వ్యవహరించారు. హిమ్మత్ సింగ్, అతని టీమ్ ఈసారి.. 'ఏఐ', 'సైబర్ క్రైమ్' నుంచి భారత్‌కు ఎదురయ్యే సవాళ్లతో పోరాటం చేయనుంది. అందుకు తగ్గట్లే ట్రైలర్ కూడా ఆసక్తికరంగా ఉంది. సిరీస్‌పై అంచనాలు పెంచుతోంది. జూలై 11 నుంచి హాట్‌స్టార్‌లో సిరీస్ స్ట్రీమింగ్ కానుంది.రెండో సీజన్ కోసం ఇప్పటికే ఉన్నవాళ్లతో పాటు కొత్తగా పలువురు నటీనటులు చేరారు. అందులో సయామీఖేర్, ప్రకాశ్ రాజ్ తదితరులు ఉన్నారు. గతంలో వచ్చిన వాటితో పోలిస్తే ఈసారి మరింత థ్రిల్ పంచేలా సిరీస్‌ని తీర్చిదిద్దినట్లు అర్థమవుతోంది. ఇకపోతే ఈ వారం దాదాపు 22కి పైగా సినిమాలు-వెబ్ సిరీసులు పలు ఓటీటీల్లోకి రాబోతున్నాయి. వీటిలో స్ట్రెయిట్ తెలుగు మూవీస్ లేవు. కానీ పలు డబ్బింగ్, పరభాషా చిత్రాలు ఉండటం విశేషం.(ఇదీ చదవండి: ఈ వారం ఓటీటీల్లో ఏకంగా 22 సినిమాలు రిలీజ్)


