
హీరో ఫ్రెండ్స్ క్యారెక్టర్స్ చేసి బాగా పాపులర్ అయిన నటి స్నిగ్ధ. ‘అలా మొదలైంది’ చిత్రంతో కెరీర్‌ని ప్రారంభించి.. మేం వయసుకు వచ్చాం, దమ్ము, ప్రేమ ఇష్క్ కాదల్, చందమామ కథలు, టైగర్, కళ్యాణ వైభోగమే, ఓ బేబీ తదితర చిత్రాలతో టాలీవుడ్‌లో తనకంటూ ప్రత్యేక గుర్తింపుని సంపాదించుకుంది. సినిమాల్లోనే కాకుండా బటయ కూడా అబ్బాయి గెటప్‌లోనే ఉంటారు టాలెటెండ్ నటి.
అబ్బాయిల మాదిరే ప్యాంట్, షర్ట్ ధరించి..హెయిర్ స్టైల్ కూడా అలానే మెంటేన్ చేస్తుంటారు. ఆమె లుక్, మాటతీరే.. సినిమా చాన్స్‌లు తెచ్చిపెట్టాయి. ఈ మధ్య ఆమెకు అవకాశాలు తగ్గాయి కానీ.. మొన్నటివరకు మంచి డిమాండ్ ఉండేది. నటనకు విరామం వచ్చినా.. ప్రజలకు మాత్రం దూరం కాలేదని చెబుతోంది ఈ నటి. సినిమాల్లో నటించకపోయినా..స్టేజ్ షోల ద్వారా అభిమానులతో టచ్‌లో ఉంటున్నానని చెబుతోంది.
ఇక తన లుక్ గురించి మాట్లాడుతూ.. ‘నేను ఇలా (ప్యాంట్, షర్ట్ ధరించి మగరాయుడిలా) ఉండడం వల్లే.. మంచి క్యారెక్టర్లు వచ్చాయి. ఒకవేల ఇప్పుడు నేను చీర కట్టుకుంటే ఫ్యాన్స్ హర్ట్ అవుతారు. నేను 5 నిమిషాల్లో చీరకట్టుకోగలను కానీ..కంఫర్టబుల్‌గా ఉండలేను. ఫ్యాన్స్ కోసమే చీర కట్టడంలేదు’అని నవ్వుతూ చెప్పారు. ఇక పెళ్లి గురించి అడగ్గా.. ‘కచ్చితంగా చేసుకుంటాను.కానీ ఇప్పుడు కాదు. కరెక్ట్ పర్సన్ దొరకాలి. నాకు నచ్చితేనే పెళ్లి చేసుకుంటా’ అని స్నిగ్ధ చెప్పుకొచ్చింది.
ఇక తన ఆదాయ మార్గాలను వివరిస్తూ.. ‘నాకు యాక్టింగ్‌తో పాటు మ్యజిక్ కూడా వచ్చు. సంగీత దర్శకురాలిగా పని చేశాను .ఎగ్జిక్యూటివ ప్రొడ్యూసర్‌గానే వర్క్ చేశా. ఇలా వచ్చిన డబ్బుతో జీవితాన్ని హాయిగా గడుపుత్నున్నా. సినిమా చాన్స్‌ల కోసం నేను ఎవరిని అడగను. వచ్చిన అవకాశాలనే తీసుకుంటాను. నా నోటిదూల కారణంగానే సినిమా చాన్స్ ఇస్తున్నారు. ఇప్పుడు షోలు చేస్తూ జీవితాన్ని గడుపుతున్నా’ అని స్నిగ్ధ చెప్పుకొచ్చింది. ఇక ఇండస్ట్రీలోని క్యాస్టింగ్ కౌచ్ గురించి మాట్లాడుతూ.. ‘నా వరకు అయితే ఇంతవరకు ఎవరూ కమిట్‌మెంట్ అడగలేదు. ఒక సిస్టర్‌లా, బ్రదర్‌లా నన్ను చూసుకున్నారు’ అని స్నిగ్ద చెప్పుకొచ్చింది.