
దర్శకుడు బాలాజీ తాజాగా రూపొందిస్తున్న చిత్రం 'ది డార్క్ హెవెన్'. క్రైమ్, థ్రిల్లర్, యాక్షన్ ఎంటర్‌టైనర్‌గా రూపొందుతున్న ఇందులో నటుడు నకుల్ హీరోగా నటించడానికి ఎంపికయ్యారు. అయితే కొంత షూటింగ్ పూర్తి అయిన తరువాత ఈ చిత్రం నుంచి నకుల్ వైదొలిగారు. దీంతో రాజారాణి–2 చిత్రం ఫేమ్ సిద్ధు కథానాయకుడిగా నటిస్తున్నారు. ఈ సినిమా గురించి దర్శక, నిర్మాత బాలాజీ మాట్లాడుతూ.. కథకు కరెక్ట్‌గా సూటవుతుందనే ఇంగ్లీష్ టైటిల్‌ను నిర్ణయించాం.
60% షూటింగ్ అయ్యాక..
ఒక గ్రామంలో జరిగే వరుస హత్యల గురించి దర్యాప్తు చేయడానికి పోలీస్ అధికారి రంగంలోకి దిగుతారు. ఆయన ఈ హత్యల మిస్టరీని ఎలా చేధించాడు? అన్నదే చిత్రకథ. ఈ చిత్రంలో ముందుగా హీరోగా నకుల్‌ను ఎంపిక చేశాం, ఆయనతో 60 శాతం షూటింగ్ పూర్తి చేశాం. కానీ, కొన్ని అనివార్య కారణాల వల్ల ఆయన్ని సినిమా నుంచి తప్పించి సిద్ధును కథానాయకుడిగా ఎంపిక చేశాం. నా స్పీడ్‌ను నకుల్ అందుకోలేకపోయారు.
షూటింగ్‌లో కథానాయకుడు కట్ చెప్పడం సరికాదు. నకుల్ మాత్రం సీన్లు చేస్తుండగా కట్ చెప్పేవారు. నాకు సంబంధించినంత వరకు హీరో ఎవరన్నది ముఖ్యం కాదు, ఆ పాత్రకు ఎవరు కరెక్ట్ అన్నదే ముఖ్యమని భావించాను. ఇందులో బిగ్ బాస్ ఫేమ్ దర్శిక కథానాయికగా, రితిక, అరుల్‌జ్యోతి, ప్రదీప్, జయకుమార్ జానకిరామన్,అజిత్ జోషి, చాప్లిన్ బాలు ముఖ్య పాత్రలను పోషిస్తున్నారు అని చెప్పారు. పీకే చాయాగ్రహణం, శక్తి బాలాజీ సంగీతాన్ని అందిస్తున్న ఈ చిత్రాన్ని డిసెంబర్ నెలలో తెరపైకి తీసుకురావడానికి సన్నాహాలు చేస్తున్నారు.
చదవండి: పిచ్చిపట్టినట్లుగా ప్రవర్తించిన రీతూ.. ఓనర్‌గా రాము రాథోడ్