బాలీవుడ్‌లో 'తంగలాన్‌' బ్యూటీ.. 'యుధ్రా' ట్రైలర్‌లో రొమాన్స్‌ | Siddhant Chaturvedi And Malavika Mohanan Yudhra Trailer Out Now | Sakshi
Sakshi News home page

బాలీవుడ్‌లో 'తంగలాన్‌' బ్యూటీ.. 'యుధ్రా' ట్రైలర్‌లో రొమాన్స్‌

Aug 29 2024 9:25 PM | Updated on Aug 29 2024 9:27 PM

Siddhant Chaturvedi And Malavika Mohanan Yudhra Trailer Out Now

సిద్ధాంత్‌ చతుర్వేది- మాళవిక మోహనన్‌ జోడిగా నటించిన చిత్రం 'యుధ్రా'. ఈ సినిమాతో మాళవిక మోహనన్‌ బాలీవుడ్‌కు పరిచయం కానుంది. ఇటీవలే ‘తంగలాన్‌’తో ప్రేక్షకులను మెప్పించిన మాళవిక మోహనన్‌ బాలీవుడ్‌ వెండితెరపై తన సత్తా ఏంటో చూపించనుంది.  యాక్షన్‌ థ్రిల్లర్‌ చిత్రంగా తెరకెక్కిన 'యూధ్రా' నుంచి తాజాగా ట్రైలర్‌ను మేకర్స్‌ విడుదల చేశారు.

 ‘మామ్‌’ ఫేమ్‌ రవి ఉద్యవార్‌ ఈ సినిమాను తెరకెక్కిస్తున్నారు. మరో సరికొత్త పాత్రలో మాళవిక, సిద్ధాంత్‌ ఇందులో కనిపించనున్నారు. ఎక్సెల్ ఎంటర్‌టైన్‌మెంట్‌పై రితేశ్‌ సిధ్వాని, ఫర్హాన్‌ అక్తర్‌ నిర్మించిన ఈ సినిమా సెప్టెంబర్‌ 20న ప్రేక్షకుల ముందుకు రానుంది. ప్రభాస్‌ సరసన 'రాజాసాబ్‌'లో కూడా మాళవిక నటిస్తున్న విషయం తెలిసిందే.

Advertisement
 
Advertisement
Advertisement