'Shankar' Name Sentiment For Mega Heroes Movies - Sakshi
Sakshi News home page

Mega Family: ఆ పేరు వెంటపడుతున్న మెగాహీరోలు!

Jun 21 2023 7:54 AM | Updated on Jun 22 2023 10:46 AM

Shankar Name Sentiment In Mega Heroes Movies - Sakshi

మెగా ఫ్యామిలీకి గత కొన్నాళ్ల నుంచి అన్నీ కలిసొస్తున్నాయి. 'ఆర్ఆర్ఆర్'కి ఆస్కార్ రావడంతో రామ్ చరణ్ గ్లోబల్ వైడ్ గుర్తింపు తెచ్చుకున్నాడు. యాక్సిడెంట్ తర్వాత చాన్నాళ్ల సినిమాలకు దూరమైన సాయిధరమ్ తేజ్.. 'విరూపాక్ష'తో హిట్ కొట్టి కమ్‌బ్యాక్ ఇచ్చాడు. కొన్నిరోజుల ముందు నాగబాబు కొడుకు వరుణ్ తేజ్ ఎంగేజ్ మెంట్ జరిగింది. ఇప్పుడేమో రామ్ చరణ్ కు కూతురు పుట్టింది. ఇలా ఒకటి తర్వాత ఒకటి గుడ్ న్యూస్ లు వినిపిస్తున్నాయి.

(ఇదీ చదవండి: చరణ్-ఉపాసన బిడ్డకు ఆ నంబర్ సెంటిమెంట్!?)

ఇలా మెగాఫ్యామిలీ అంతా హ్యాపీగా ఉన్నారు. మరోవైపు హీరోలందరూ సినిమాలు చేస్తూ పుల్ బిజీ. ఇలాంటి టైంలో మెగాహీరోల సినిమా టైటిల్స్ లోని ఓ పేరు సెంటిమెంట్ తెరపైకి వచ్చింది. 'విరూపాక్ష' తర్వాత సాయితేజ్‌ నటిస్తున్న మూవీకి 'గాంజా శంకర్' అనే టైటిల్ రిజిస్టర్ చేసినట్లు టాక్ రావడంతో ఇది కాస్త సోషల్ మీడియాలో చర్చనీయాంశంగా మారింది. ఈ మూవీకి సంపత్ నంది దీనికి దర్శకత్వం వహించనున్నారు. త్వరలో అధికారిక ప్రకటన రానుంది. 

గతంలో చిరంజీవి హీరోగా 'శంకర్ దాదా ఎంబీబీఎస్', 'శంకర్ దాదా జిందాబాద్' మూవీ చేశారు. పవన్ కల‍్యాణ్ 'గుడుంబా శంకర్' చేశారు. ఇప్పుడు చిరు మళ్లీ 'భోళా శంకర్' అనే చిత్రం చేస్తున్నారు. తాజాగా సాయిధరమ్ తేజ్.. 'గాంజా శంకర్' అనే మాస్ టైటిల్ ని తన కొత్త మూవీ కోసం ఫిక్స్ చేసుకున్నట్లు తెలుస్తోంది. ఇలా అందర 'శంకర్' అనే పేరుని టైటిల్ ఉపయోగించడం సమ్‌థింగ్ ఇంట్రెస్టింగ్‌గా మారింది. భవిష్యత్తులో మిగతా మెగా హీరోలు కూడా ఈ పేరుతో సినిమాలేమైనా చేస్తారేమో!?

(ఇదీ చదవండి: మేనేజర్ మోసం.. రష్మిక షాకింగ్ నిర్ణయం!)

Advertisement
 
Advertisement
Advertisement