Rashmika Mandanna's manager cheats her of Rs 80 lakh? here's the truth - Sakshi
Sakshi News home page

Rashmika Mandanna: రష్మిక కీలక నిర్ణయం.. ఇకపై అలానే!

Jun 21 2023 7:11 AM | Updated on Jun 21 2023 8:58 AM

Rashmika Manager Issue, Manages Her Own - Sakshi

నేషనల్ క్రష్, హీరోయిన్ రష్మిక గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. తెలుగులో ఇ‍ప్పటికే మహేశ్, అల్లు అర్జున్ లాంటి స్టార్స్ తో నటించి హిట్స్ కొట్టిన ఈ భామ.. ప్రస్తుతం పాన్ ఇండియా మూవీస్ తో బిజీగా ఉంది. రీసెంట్ గా ఈమెని తన మేనేజర్ మోసం చేశాడు. ఏకంగా రూ 80 లక్షల వరకు మోసం చేశాడని కామెంట్స్ వినిపించాయి. ఈ క్రమంలోనే రష్మిక కీలక నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది.

(ఇదీ చదవండి: 'సలార్' కొత్త పోస్టర్‌లో 'కేజీఎఫ్' కనెక్షన్.. గమనించారా?)

కన్నడలో హీరోయిన్ గా పరిచయమైన రష‍్మిక.. 'ఛలో' మూవీతో తెలుగులోకి అడుగుపెట్టింది. తన క‍్యూట్ యాక్టింగ్ తో ప్రేక్షకులకు దగ్గరైంది. మహేశ్ తో 'సరిలేరు నీకెవ్వరు' చేసి ఓ మాదిరి క్రేజ్ తెచ్చుకున్న ఈ భామ.. అల్లు అర్జున్ 'పుష్ప'తో దేశవ్యాప్తంగా ఫేమ్ సొంతం చేసుకుంది. చెప్పాలంటే ఈ మూవీతో పాన్ ఇండియా స్టార్ అయిపోయింది. ప్రస్తుతం తెలుగు, హిందీ చిత్రాలతో బిజీగా ఉంది.

ఈ మధ్య తన మేనేజర్ మోసం చేయడంతో.. ఇకపై అంతా ఒంటరిగానే మేనేజ్ చేసుకునేందుకు రష్మిక సిద్ధమైందట. అంటే తన డేట్స్ తానే చూసుకోవాలని నిర్ణయం తీసుకుందని తెలుస్తోంది. మళ్లీ అలాంటి తప్పులు జరగకుండా ఉండేందుకు ఇలా చేసిందని సమాచారం. రీసెంట్ గా సందీప్ రెడ్డి వంగా తీస్తున్న 'యానిమల్' షూటింగ్ పూర్తి చేసింది. త్వరలో 'పుష్ప 2' సెట్ లో అడుగుపెట్టబోతున్న విషయాన్ని ఆమెనే చెప్పింది.

(ఇదీ చదవండి: పాన్ ఇండియా హీరోలకు బోలెడు కష్టాలు.. ప్రభాస్ సహా వాళ్లందరూ!)

Advertisement
 
Advertisement
Advertisement