సమంత బేబీ బంప్.. సిక్స్ ప్యాక్ అంటూ పోస్ట్...! | Samantha Shares Her baby Bump Pic in Her Instagram Stories | Sakshi
Sakshi News home page

Samantha: సమంత బేబీ బంప్.. సిక్స్ ప్యాక్ అంటూ పోస్ట్...!

Jul 1 2026 4:29 PM | Updated on Jul 1 2026 4:52 PM

Samantha Shares Her baby Bump Pic in Her Instagram Stories

సమంత ఇటీవలే మా ఇంటి బంగారంతో సూపర్ హిట్‌ తన ఖాతాలో వేసుకుంది. నందిని రెడ్డి డైరెక్షన్‌లో వచ్చిన ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద కళ్లు చెదిరే కలెక్షన్స్ రాబట్టింది. ఏకంగా రూ.75 కోట్లకు పైగా వసూళ్లు సాధించింది. లేడీ ఓరియంటెడ్ మూవీ కావడంతో మహిళా అభిమానులు థియేటర్లకు క్యూ కడుతున్నారు. ఇప్పటికీ ఈ సినిమా థియేటర్లలో సందడి చేస్తోంది.

ఈ మూవీ హిట్ ప్రమోషన్ల టైమ్‌లో సమంత ప్రెగ్నెన్నీపై రూమర్స్ వినిపించాయి. ఈ సినిమా రిలీజైన  తర్వాత సక్సెస్ మీట్‌లో ఈ విషయాన్ని అఫీషియల్‌గా ప్రకటించింది. దీంతో అభిమానులకు డబుల్ ట్రీట్ ఇచ్చింది. ప్రస్తుతం సినిమాలకు విరామం ప్రకటిస్తున్నానని తెలిపింది. నా బేబీ కోసం మెటర్నిటీ లీవ్‌లో ఉంటానని సామ్ ఆనందం వ్యక్తం చేసింది.

తాజాగా సమంత బేబీ బంప్‌తో ఉన్న పిక్‌ను షేర్ చేసింది. తన ఇన్‌స్టాగ్రామ్‌ స్టోరీస్‌లో ఫోటోను పంచుకుంది. మై సిక్స్ ప్యాక్.. నేను నిన్ను చూసినప్పుడే చూస్తాను.. అంటూ క్యాప్షన్ రాసుకొచ్చింది. సమంత సిక్స్ ప్యాక్ అని రాయడంతో ఆమెకు ఇప్పుడు ఆరో నెల ప్రెగ్నెన్సీతో ఉందంటూ కొందరు నెటిజన్స్ కామెంట్స్ చేస్తున్నారు. కాగా.. సమంత గతేడాది డైరెక్టర్ రాజ్ నిడిమోరును పెళ్లాడింది.

smaa

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement