
ఐదేళ్ల క్రితం లాక్‌డౌన్ టైంలో బాలీవుడ్ హీరో సుశాంత్ సింగ్ రాజ్‌పుత్ ఆత్మహత్య చేసుకుని చనిపోయాడు. అయితే ఈ విషయమై అప్పట్లో ఇతడి మాజీ ప్రియురాలు రియా చక్రవర్తిని పోలీసులు అరెస్ట్ చేశారు. తర్వాత కోర్టు, కేసులు అంటూ ఆ కేసు చాన్నాళ్ల పాటు సాగుతూనే వచ్చింది. అయితే ఇన్నాళ్లకు ఈమెకు కొంతమేర విముక్తి దొరికినట్లు తెలుస్తోంది.
(ఇదీ చదవండి: బిగ్‌బాస్ నుంచి మాస్క్ మ్యాన్ ఎలిమినేట్.. కాకపోతే!)
దాదాపు ఐదేళ్ల తర్వాత పాస్‌పోర్ట్ తన చేతికి తిరిగొచ్చిందని రియా చక్రవర్తి ఇన్ స్టాలో పోస్ట్ పెట్టింది. ఈ క్రమంలోనే తోటినటీనటులు కంగ్రాట్స్ చెబుతున్నారు. గత ఐదేళ్లుగా చాలా ఇబ్బందులు ఎదుర్కొన్నానని కొన్నాళ్ల క్రితం ఓ ఇంటర్వ్యూలో రియానే స్వయంగా చెప్పింది. వ్యక్తిగత జీవితంలోనూ ఎన్నో విషయాల్లో రాజీ పడాల్సి వచ్చిందని కూడా ఆవేదన వ్యక్తం చేసింది. సుశాంత్ సింగ్ కేసు విచారణ సమయంలో రియాకు విదేశీ ప్రయాణానికి అనుమతి ఇవ్వలేదు. పాస్‌పోర్ట్‌ని పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. ఇప్పుడు ఇన్నాళ్లకు తిరిగిచ్చేయడంతో రియా ఆనందగానికి హద్దుల్లేకుండా పోయింది.
పశ్చిమ బెంగాల్‌కి చెందిన రియా చక్రవర్తి.. 'తూనీగ తూనీగ' అనే తెలుగు సినిమాతో హీరోయిన్‌గా పరిచయమైంది. తర్వాత పూర్తిగా హిందీకే పరిమితమైంది. మొత్తంగా ఏడెనిమిది చిత్రాల్లో మాత్రమే నటించింది. ఎప్పుడైతే సుశాంత్ సింగ్ చనిపోయాడో అప్పటినుంచి ఈమెకు సినిమా అవకాశాలు పూర్తిగా తగ్గిపోయాయి. ఇప్పుడు కొంతమేర క్లియర్ కావడంతో మళ్లీ సినిమా ఛాన్సులు వస్తాయేమో చూడాలి. ప్రస్తుతానికైతే రియా చక్రవర్తి.. బిగ్‌బాస్ షోలో పాల్గొని తనని తాను నిరూపించుకోవాలని అనుకుంటోంది.
(ఇదీ చదవండి: నన్ను 'లేడీ ప్రభాస్' అని పిలుస్తుంటారు: శ్రీనిధి శెట్టి)