తలైవా ఫ్యాన్స్ ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తోన్న మూవీ జైలర్-2. గతంలో వచ్చిన జైలర్‌కు సీక్వెల్‌గా ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నారు. నెల్సన్ దిలీప్‌కుమార్ డైరెక్షన్‌లో ఈ సినిమా రానుంది. తాజాగా ఈ మూవీ సెన్సార్ పూర్తి చేసుకుంది. ఈ చిత్రానికి సెంట్రల్ బోర్డ్ ఆఫ్ ఫిల్మ్ సర్టిఫికేషన్ యూ/ఏ సర్టిఫికేట్ జారీ చేసినట్లు తెలుస్తోంది. అంతేకాకుండా ఈ మూవీ రన్‌టైమ్ మూడు గంటల కంటే తక్కువే ఉందని సమాచారం. దీనిపై ఇంకా అఫీషియల్ ప్రకటన రావాల్సి ఉంది.
'జైలర్ 2' నిడివి 165 నిమిషాల 18 సెకన్లుగా ఉన్నట్లు సోషల్ మీడియాలో చర్చ నడుస్తోంది. గతంలో రిలీజైన జైలర్ కంటే కేవలం మూడు నిమిషాలు మాత్రమే తక్కువ నిడివిని కలిగి ఉంది. కాగా.. ఈ చిత్రాన్ని సన్ పిక్చర్స్ బ్యానర్‌పై నిర్మిస్తున్నారు. ఈ సీక్వెల్‌లో ఎస్.జె. సూర్య, విద్యా బాలన్, సూరజ్ వెంజరమూడు, మిథున్ చక్రవర్తి కీలక పాత్రల్లో నటిస్తున్నారు. మోహన్‌లాల్, శివ రాజ్‌కుమార్ కూడా ఈ ఫ్రాంచైజీలో కనిపించనున్నట్లు తెలుస్తోంది. ఇటీవలే ట్రైలర్ రిలీజ్ కాగా.. అభిమానుల్లో అంచనాలు పెంచేసింది. ఈ సినిమాకు అనిరుధ్ రవిచందర్ సంగీతమందిస్తుండగా.. అక్టోబర్ 15న ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలో విడుదల కానుంది.


